ఈరోజు జైపూర్ వేదికగా రాజస్థాన్ తో జరుగుతున్న మ్యాచ్ లో లక్నో సూపర్ జేయింట్స్ రక్షనాత్మక స్కోర్ ను సాధించారు. టాస్ గెలిచిన తొలుత బ్యాటింగ్ కు దిగిన లక్నో.. రాజస్థాన్ పై నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు సాధించింది.
ఐడెన్ మార్కరమ్ (66), ఆయుష్ బదొని (50) అర్ధశతకాలతో అదరగొట్టారు. ఇక ఆఖర్లో అబ్దుల్ సమద్ (10 బంతుల్లో 30) ధనాధన్ బ్యాటింగ్ తో చెలరేగాడు. లక్నో బ్యాటర్లలో వీరు మినహా మరే ఆటగాడు రాణించలేకపోయారు.
ఇక రాజస్థాన్ బౌలర్లలో హసరంగ రెండు వికెట్లు పడగొట్టగా.. ఆర్చర్, సందీప్ శర్మ, తుషర్ దేశ్ పాండే తలా ఒక వికెట్ దక్కించుకున్నారు. దీంతో సొంత మైదానంలో గెలుపే లక్ష్యంగా రాజస్థాన్ జట్టు 181 పరుగుల లక్ష్యంతో ఛేజింగ్ కు దిగనుంది.