రాజస్థాన్ తో ఢిల్లీ వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో మొదట మ్యాటింగ్ చేపట్టిన చెన్నై… బలమైన స్కోర్ నమోదు చేసింద. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన సీఎస్కే… నిర్ణీత ఓవర్లో 8 వికెట్ల నష్టానికి 187 పరుగులు సాధించింది.
ఈ ఇన్నింగ్స్ లో చెన్నై జట్టు యువ ఓపెనర్ ఓపెనర్ ఆయుష్ (20 బంతుల్లలో 43) – డెవాల్డ్ బ్రెవిస్ (25 బంతుల్లలో 42) అద్భుతంగా రాణించారు. ధనాధన్ బౌండరీలతో తక్కువ బంతుల్లో ఎక్కువ పరుగులు రాబట్టి చెన్నై స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు.
ఇక శివం దూబే (39), రవిచంద్రన్ అశ్విన్ (13), కెప్టెన్ ధోని (16) రెండంకెల పరుగులు సాధించారు. రాజస్థాన్ బౌలర్లలో ఆకాష్ మధ్వాల్ ,యుధ్వీర్ సింగ్ మూడు వికెట్లు తీయగా.. తుషార్ దేశ్పాండే, వనిందు హసరంగా ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. దాంతో రాజస్థాన్ జట్టు 188 పరుగుల టార్గెట్ తో ఛేజింగ్ కు దిగనుంది.