AP | గంజాయి పై ఉక్కు పాదం… 9 కేజీల గంజాయి స్వాధీనం
- టాస్క్ ఫోర్స్ లాండ్ ఆర్డర్ సంయుక్త ఆపరేషన్…
- పోలీసుల అదుపులో ఆరుగురు నిందితులు…
( విజయవాడ ఆంధ్రప్రభ ) : గంజాయి రవాణా, విక్రయం, కొనుగోలు, సరఫరాలో కీలకంగా వ్యవహరిస్తున్న వారిపై జిల్లా పోలీసులు ఉక్కు పాదం మోపుతున్నారు. సిటీ టాస్క్ ఫోర్స్, లా అండ్ ఆర్డర్ సంయుక్తంగా కలిసి సూర్యారావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి క్రయవిక్రయాలు చేస్తున్న ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్దనుంచి తొమ్మిది కేజీల గంజాయిని, వీరు ఉపయోగిస్తున్న బైకులను స్వాధీనం చేసుకున్నారు.
ప్రస్తుతం మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. గంజాయిని అక్రమంగా తరలిస్తున్న వ్యక్తులను పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్లు శ్రీధర్ కుమార్ణి, నాగ శ్రీనివాస్, ఎస్ ఆర్ పేట ఇన్ స్పెక్టర్ అహ్మద్ అలీలను సిబ్బంది అభినందించారు.