Rocket City Marathon | శభాష్.. లాస్య
- అమెరికాలో నిర్వహించిన మారథాన్లో పథకం
- 21 సంవత్సరాలకే ఐసీసీ కోచ్ లెవెల్ వన్ సర్టిఫికెట్
Rocket City Marathon | ఆంధ్రప్రభ ప్రతినిధి, భూపాలపల్లి: అమెరికాలోని అలాభామా స్టేట్స్ హన్స్ విల్ సిటీలో రాకెట్ సిటీ మారథాన్(Rocket City Marathon) 21 కిలోమీటర్ల విభాగంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన యువ కెరటం బుర్ర లాస్యగౌడ్ పథకం సాధించి సత్తా చాటింది. గతంలో ఆమె అమెరికా(USA)లోని మీనాసోటా రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించడంతో పాటు తెలంగాణ అండర్ 19 క్రికెటర్ పోటీలలో పాల్గొని అత్యుత్తమ ప్రతిభ కనబరిచినారు.

21 సంవత్సరాలకే ఐసీసీ కోచ్ లెవెల్ వన్ సర్టిఫికెట్ పొందారు. ఈ సందర్భంగా అలాభామా యూనివర్సిటీ అధాపకులు అభినందనలు తెలిపారు. విషయం తెలుసుకున్న భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి(MLA Gandra Venkataramana Reddy) ఫోన్ ద్వారా అభినందనలను తెలిపారు. వీరితోపాటు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి, జీఎంఆర్ ట్రస్ట్ చైర్మన్ గండ్ర గౌతమ్ రెడ్డి, సింగరేణి స్పోర్ట్స్ సూపర్వైజర్ పర్స శ్రీనివాస్, అథ్లెటిక్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు పొక్కూరి చిన రాజయ్య, పూతల సమ్మయ్య క్రికెట్ కోచ్ శ్రీనివాస్ అభినందించారు.

