Road Widening | రోడ్డు వెడల్పు పనులకు శ్రీకారం

Road Widening | రోడ్డు వెడల్పు పనులకు శ్రీకారం
చెన్నూర్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా (Manchryala District) చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ (ఓల్డ్ బస్టాండ్ )నుంచి కోటపల్లి బస్టాప్ (పెద్ద చెరువు )వరకు రోడ్డు వెడల్పు (Road Widening Works) చేసేందుకు మున్సిపల్ అధికారులు ఇవాళ ఉదయం నుంచి పనులు మొదలుపెట్టారు. దిన దినాభివృద్ధి చెందుతున్న చెన్నూరు పట్టణంలో ప్రస్తుతమున్న 30ఫీట్ల రోడ్డుతో ప్రజలు వాహనదారులు నిత్యం ట్రాఫిక్ జామ్ (Traffic jam) అవుతుండడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో రోడ్డు వెడల్పు పనులకు శ్రీకారం చుట్టినట్లు మున్సిపల్ కమిషనర్ మురళీ క్రిష్ణ తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రస్తుతం ఉన్న 30ఫీట్ల రోడ్డును 66 ఫీట్ల వరకు వెడల్పు చేసేందుకు కొలతలు సేకరిస్తున్నట్లు కమిషనర్ తెలిపారు.
