Road Show | అభివృద్ధి జ‌ర‌గాలంటే గెలిపించండి…

Road Show | అభివృద్ధి జ‌ర‌గాలంటే గెలిపించండి…

Road Show | ఇల్లెందు, ఆంధ్ర‌ప్ర‌భ : ఇల్లెందు మండలంలోని పలు పంచాయతీలలో ఎమ్మెల్యే కోరం కనకయ్య(MLA Koram Kanakaiah) ఈ రోజు విస్తృతంగా పర్యటించి కాంగ్రెస్ అభ్యర్ధులను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. మండలంలోని బొజ్జాయి గూడెం, సుదిమల్ల, పూబెల్లి, రాగబోయినగూడెం, ఇందిరానగర్, సి ఎస్ పి బస్తితో పాటు పలు పంచాయతీలలో జరిగిన రోడ్ షో(road show), బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాలలో అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ అభ్యర్ధులను గెలిపించాలని కోరారు.

ఉచిత విద్యుత్, ఉచిత బస్, ప్రయాణం, రైతు రుణ మాఫీ, గిట్టుబాటు ధర ఇతర మౌలిక వసతులు కల్పించిన ప్రజా ప్రభుత్వంను ఆదరించి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అభ్యర్ధులు ప్రియాంక, పద్మ, కున్సోత్ రాము, స్వాతి, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply