దమ్మపేటలో రోడ్డు భద్రతా వారోత్సవాలు

దమ్మపేట, ఆంధ్రప్రభ ; తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 99 రోజుల ప్రణాళిక “ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక” కార్యక్రమంలో భాగంగా సోమవారం నుండి వారం రోజులు పాటు రోడ్డు భద్రత వారోత్సవాలను నిర్వహించనున్నట్లు దమ్మపేట ఎస్సై సాయి కిషోర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా దమ్మపేట మండల పరిధిలోగల 31 గ్రామ పంచాయతీలలో విలేజ్ రోడ్ సేఫ్టీ కమిటీలను ఏర్పాటు చేసి, వారి ఆధ్వర్యంలో పోలీసు పర్యవేక్షణలో 31 గ్రామ పంచాయతీలలో రోడ్డుకి ఇరువైపులా గల చెట్ల పొదలను, గుంతలను , రోడ్డు ప్రమాణాలు పాటించాలని దమ్మపేట మండల ప్రజలందరకూ తెలియజేశారు . ఈ కార్యక్రమంలో దమ్మపేట మండల అదనపు ఎస్ఐ బాలస్వామి, పోలీస్ సిబ్బంది ,ఆయా గ్రామాల సర్పంచులు, వార్డు మెంబర్లు, విలేజ్ రోడ్ సేఫ్టీ కమిటీ మెంబర్స్ పాల్గొన్నారు.
