Road safety rules | పాటిస్తే ప్రమాదాలకు చెక్

Road safety rules | పాటిస్తే ప్రమాదాలకు చెక్
- వారోత్సవాల సందర్భంగా గోదావరిఖనిలో ర్యాలీ
- ప్రధాన చౌరస్తాలో విద్యార్థులచే మానవహారం
గోదావరిఖని, ఆంధ్రప్రభ : రోడ్డు భద్రత నియమాలను ప్రతి ఒక్కరూ పాటించాలని గురువారం గోదావరిఖని పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. మండల న్యాయ సేవా సంస్థ, రామగుండం కమిషనరేట్ ట్రాఫిక్ పోలీసుల సంయుక్త ఆధ్వర్యంలో భద్రత వారోత్సవాల సందర్భంగా నగరంలో ప్రదర్శన నిర్వహించారు. స్థానిక మార్కండేయ కాలనీ ఏరియా నుండి గోదావరిఖని పట్టణ ప్రధాన చౌరస్తా వరకు భద్రత వారోత్సవాల నియమాలను సూచిస్తూ ప్లే కార్డులతో ప్రదర్శన చేపట్టారు.

మద్యం సేవించి వాహనాలు నడపరాదని… వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ ధరించాలని… రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని విద్యార్థులు నినదించారు. వాహనాలలో ప్రయాణించేటప్పుడు మద్యం సేవించడం, సెల్ఫోన్ చూడడం, నిద్రలేమి వంటి కారణాలతో డ్రైవింగ్ చేయడం వల్ల ప్రమాదాలకు గురవుతున్నారని రామగుండం ట్రాఫిక్ పోలీసులు పేర్కొన్నారు. రోడ్డు నిబంధనలను పాటిస్తూ ప్రమాదాలను అరికట్టాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని ఈ సందర్భంగా పోలీస్ అధికారులు పిలుపునిచ్చారు. రోడ్డు భద్రత నియమాలను పాటించే విషయంలో బాధ్యతగా వ్యవహరించాలన్నారు.
