రోడ్డు బాగు చేశారు!

రోడ్డు బాగు చేశారు!

జైనూర్‌, ఆంధ్ర‌ప్ర‌భ : భారీ వర్షాలకు గుంతలమయంగా మారిన రోడ్డులో ద్విచక్ర వాహనాలు(Two-wheelers), ఆటోలు కూడా వెళ్ల‌ని పరిస్థితి నెల‌కొంది. గిరిజ‌న అవ‌స్థల‌ను చూసి చ‌లించిపోయిన ఓ గిరిజన గ్రామ యువకులు శ్ర‌మ‌దానాని(Shramadanani)కి శ్రీ‌కారం చుట్టారు. రోడ్డుపై ఉన్న గుంత‌ల‌ను పూడ్చి వేశారు.

కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని మారుమూల గిరిజన పంచాయతీ చింతకర్ర ప‌రిధిలోని(Chintakarra range) చింత కర్ర తాటి గూడ, కిషన్ నాయక్ తండ రోడ్డు భారీ వర్షాలకు గుంతల మయంగా మారింది. ఎవరో వస్తారనీ.. ఏదో చేస్తారని చూడకుండా గ్రామ యువకులు ఆదివారం శ్ర‌మ‌దానం చేశారు. రోడ్డు మరమ్మత్తు(repair) పనులకు శ్రీకారం చుట్టారు. శ్రమదానం చేసిన‌ యువకుల‌ను ఆయా గ్రామాల ప్రజలు అభినందించారు.

ఆ గ్రామ‌ పంచాయతీకి ప్రభుత్వ బీటి రోడ్డు మంజూరు చేసినా అటవీశాఖ( Forest Department) అనుమతులు లేక బీటి రోడ్డు నిర్మాణ పనులు నిలిచిపోయాయి. దీంతో ఆ గిరిజ‌నులకు మట్టి రోడ్డు దిక్కైంది. ఇప్ప‌టికైనా అధికారులు స్పందించి బీటీ రోడ్డు నిర్మాణానికి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని గిరిజ‌నులు కోరుతున్నారు.

Leave a Reply