Road Facilities | పారేవులను ఆదర్శంగా తీర్చిదిద్దుతా
- ఆదరించి సర్పంచ్ గా గెలిపించండి
- పారేవుల సర్పంచ్ అభ్యర్థి కటికె అంజమ్మ ఆంజనేయులు
Road Facilities | మక్తల్, ఆంధ్రప్రభ : గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఆదరించి.. ఆశీర్వదించి.. తనను సర్పంచ్ గా గెలిపిస్తే పారేవుల గ్రామాన్ని ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దుతానని కాంగ్రెస్ పార్టీ మద్దతుతో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కటికే అంజమ్మ ఆంజనేయులు అన్నారు. ఈ రోజు మార్కెట్ కమిటీ(Market Committee) డైరెక్టర్ పాతింటి విష్ణువర్ధన్ రెడ్డి, నాయకులు రవీందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ మణివర్థన్ రెడ్డితో కలిసి ముమ్మరంగా ఇంటింటి ప్రచారం చేపట్టారు.
గడపగడపకు వెళ్లి ఓటర్లను కలుసుకొని తనకు మద్దతు ఇచ్చి సర్పంచ్ గా గెలిపించవలసిందిగా అభ్యర్థించారు. తనను గెలిపిస్తే గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. కొత్త పారేవుల నుండి పాత పారేవులకు రోడ్డు సౌకర్యం(Road Facilities) కల్పించేందుకు కృషి చేస్తానన్నారు.
అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా పనిచేస్తున్న మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి సహకారంతో గ్రామాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడమే తన లక్ష్యమన్నారు. గ్రామంలో అంతర్గత రోడ్లు, మురుగు కాలువల నిర్మాణానికి, మంచినీటి సౌకర్యానికి ప్రాధాన్యమిస్తానని చెప్పారు. గ్రామ అభివృద్ధి(Village Development) చెందాలంటే అధికార పార్టీ మద్దతు అవసరమని అందుకు తనను ఎన్నికల్లో సర్పంచ్ గా గెలిపించవలసిందిగా అంజమ్మ ఆంజనేయులు విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో నాయకులు ఆంజనేయులు, ఇటిక్యాల ఆంజనేయులు, ఆంజనేయులు, గోపాల్, లింగారెడ్డి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

