ప్రకాశం : వేగంగా వెళ్తోన్న ఓ కారు.. ముందున్న ఓ లారీని ఢీకొట్టింది. ఇంతలో మరో లారీ ఆ కారు వచ్చి గుద్దేసింది. దీంతో కారు పూర్తిగా నమూరూపాల్లేకుండా ధ్వంసమైంది. అందులో ఉన్నవారు ఘటనా స్థలిలోనే చనిపోయారు. అత్యంత భయానకమైన ఈ ప్రమాదం ప్రకాశం జిల్లాలో ఇవాళ తెల్లవారుజామున చోటుచేసుకుంది. నిర్లక్ష్యం కారణంగా రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుని ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అతివేగమే ఈ మూడు ప్రమాదాలకు కారణమైనట్టు ప్రకాశం జిల్లా పోలీసులు వెల్లడించారు.
ప్రకాశం జిల్లాలో ఇవాళ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. ఈ ఘటనల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో ముగ్గురు గాయపడ్డారు. ఒంగోలు మండలం కొప్పోలు సమీపంలో 16వ నెంబరు జాతీయ రహదారిపై వేగంగా వెళ్తోన్న ఓ కారు.. ముందున్న లారీని ఢీకొట్టింది. ఇదే సమయంలో వెనుక నుంచి వస్తోన్న మరో లారీ ఆ కారుపై దూసుకెళ్లింది. దీంతో ఆ కారు రెండు లారీ మధ్యలో చిక్కుకుని మొత్తం నుజ్జునుజ్జుయ్యింది. అందులోని ఉన్న ఐదుగురు తీవ్రంగా గాయపడగా.. ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే పోలీసులు.. హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు.