Road Accident | కొడుకు పరిస్థితి విషమం

Road Accident | కృత్తివెన్ను, ఆంధ్రప్రభ : కృత్తివెన్ను మండలం గరిసిపూడి వద్ద హైవేపై ఇవాళ విషాదం నెలకొంది. కారు, బైక్, వ్యాన్ మూడు వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరుకు చెందిన ఒడుగు బాల బాబూజీ (45) అక్కడికక్కడే మృతి చెందారు.
ఆయన కుమారుడు కార్తీక్ (19) తీవ్రంగా గాయపడగా, పరిస్థితి విషమంగా ఉంది. వెంటనే స్పందించిన పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
