వెబ్ డెస్క్, హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో మరోసారి రోడ్డు ప్రమాదం (Road Accident) ప్రాణాన్ని బలిగొంది. నిర్లక్ష్యంగా నడిపిన వాహనం అమాయక ప్రాణాన్ని కబళించింది. హయత్ నగర్ (Hayathnagar) లో మంగళవారం ఉదయం దారుణ సంఘటన చోటుచేసుకుంది. రోడ్డు దాటుతున్న ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని వేగంగా వస్తున్న వాహనం ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. స్థానికులు భీతిల్లి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న హయత్‌నగర్ పోలీసులు (Hayathnagar Police) ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన వాహనంపై కేసు నమోదు చేసి, డ్రైవర్‌పై దర్యాప్తు ప్రారంభించారు.

Leave a Reply