Road Accident | నలుగురు విద్యార్థులు దుర్మరణం..

Road Accident | మిర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం..
ఉమ్మడి రంగారెడ్డి బ్యూరో, ఆంధ్రప్రభ : శంకర్ పల్లి మండలం మోకిల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం లో నలు గురు విద్యార్థులు దుర్మరణం చెందారు. మోకిల పోలీసులు అందించిన సమాచారం మేరకు వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.
మండలంలోని దొంతాన్ పల్లి ఇక్ఫాయ్ బిజినెస్ స్కూల్ లో బి బి ఏ మూడో సంవత్సరం చదువుతున్న నలుగురు విద్యా ర్థులు కోకాపేటలో మరో ఫ్రెండ్ బర్త్ డే ప్రోగ్రాంలో పాల్గొని తిరిగి వచ్చే క్రమంలో ప్రమాదానికి గురయ్యారు. ఎం.జి.ఐ.టిలో చదివే మరో విద్యార్థి డ్రాప్ చేయడానికి వచ్చి నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని మిర్జాగూడ వద్ద స్పోర్ట్స్ కారు డివైడైర్ ను ఢీ కొట్టి అనంతరం చెట్టుని ఢీకొట్టడంతో నలుగురు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయాల పాలైన మరొక విద్యార్థిని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నది.
మృతుల వివరాలు
సూర్య తేజ(20) సుమిత్(20) నిఖిల్(18) రోహిత్ (20) కాగా నక్షత్ర(20) తీవ్రంగా గాయపడి ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న దని పోలీ సులు తెలిపారు. ఎంజీఐటీలో చదివే విద్యార్థి రోహిత్ స్నేహితులను డ్రాప్ చేయడానికి వచ్చి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. విద్యార్థులు మద్యం సేవించారా లేదా అనే విషయం పోస్టుమార్టం అయితే గాని తెలుపలేమని మోకిలా పోలీసులు తెలిపారు.
