సీనియర్ CPI నాయకులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొల్లోజ్ అయోధ్య చారి (Bolloz Ayodhya Chari) సూర్యాపేట (Suryapet) వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం (Serious road accident)లో మరణించారు. ఈ విషాద ఘటన బుధవారం ఉదయం చోటుచేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (Bhadradri Kothagudem District) మణుగూరుకు చెందిన అయోధ్య చారి, ఉమ్మడి ఖమ్మం (Khammam) జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్‌గా ప్రజల్లో సుపరిచితులు. పినపాక నియోజకవర్గం (Pinapaka Constituency) లో ఆయనకు బలమైన నాయకుడిగా పేరుంది.

హైదరాబాద్ (Hyderabad) లోని ఓ ఆసుపత్రిలో వైద్య పరీక్షల కోసం వెళ్లేందుకు ఆయన నిన్న రాత్రి సూర్యాపేట (Suryapet) లోని తన కుమార్తె ఇంటికి వచ్చారు. ఈ రోజు ఉదయం హైదరాబాద్ బయలుదేరుతుండగా, సూర్యాపేట వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారు, వేగంగా వెళ్తున్న లారీ అకస్మాత్తుగా స్లోగా వెళ్ల‌డంతో దాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అయోధ్య చారి (Ayodhya Chari) అక్కడికక్కడే మృతి చెందారు. కారు డ్రైవర్‌కు గాయాలయ్యాయి. ఈ విషయాన్ని పోలీసులు CPI జాతీయ నాయకులు హేమంత్ రావుకు ఫోన్ చేసి తెలియజేశారు. అయోధ్య మృతి పార్టీకి, ఆయన అభిమానులకు తీరని నష్టమని పలువురు నాయకులు తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.

Leave a Reply