ROAD | మంత్రి ఆదేశం..
ROAD | అనంతపురం బ్యూరో, ఆంధ్రప్రభ : ఉరవకొండ పట్టణ పరిధిలోని కనేకల్లు క్రాస్ నుంచి గుంతకల్లు రోడ్డు వరకు జరుగుతున్న బైపాస్ రోడ్డు పనులను మంగళవారం రాష్ట్ర ఆర్థిక ప్రణాళిక, వాణిజ్య పన్నులు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ (payyavula keshav) పరిశీలించారు. పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ పనులు పూర్తి అయితే.. రాయదుర్గం నియోజకవర్గం నుంచి గుంతకల్లు వర్గానికి కనెక్టివిటీ పెరుగుతుంది. వ్యవసాయ ఉత్పత్తులు రైతుల పండించిన పంటల విక్రయాలు మార్కెటింగ్ సదుపాయాలు పెరుగుతాయి. ప్రజలకు మరింత సౌకర్యవంతంగా ఉంటుందని కేశవ్ తెలిపారు.

