Rising Global Summit | తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు రండి

Rising Global Summit | తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు రండి
కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను ఆహ్వానించిన సీఎం రేవంత్
Rising Global Summit | ఢిల్లీ, ఆంధ్రప్రభ : హైదరాబాద్ భారత్ ఫ్యూచర్ సిటీలో ఈనెల 8, 9 తేదీల్లో నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్(Rising Global Summit)కు హాజరుకావాలని కేంద్ర ఐటీ, రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్(Minister Ashwini Vaishnav)ను ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. పార్లమెంట్ లో కేంద్ర మంత్రిని సీఎం కలిశారు.
ఈ సందర్భంగా సమ్మిట్ లో ఆవిష్కరించనున్న విజన్ డాక్యుమెంట్(Vision Document) గురించి కేంద్ర మంత్రికి సీఎం వివరించారు. సీఎం వెంట ఉప ముఖ్యమంత్రి(Deputy Chief Minister) మల్లు భట్టి విక్రమార్క, ఎంపీలు డాక్టర్ మల్లు రవి, కుందూరు రఘువీర్ రెడ్డి, సురేష్ షెట్కార్, చామల కిరణ్ కుమార్ రెడ్డి, డాక్టర్ కడియం కావ్య, గడ్డం వంశీ కృష్ణ, అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారు.
