Srisailam Project : శ్రీశైలం జలాశయానికి పెరుగుతున్న వరద

  • ఇన్ ప్లో 75,551 క్యూసెక్కులు
  • ప్రస్తుత నీటిమట్టం 848.49 అడుగులు


నంద్యాల బ్యూరో, జూన్ 20 (ఆంధ్రప్రభ) : రాయలసీమ, తెలంగాణ, కోస్తాకు తలమానికమైన నంద్యాల జిల్లా శ్రీశైలంలోని భ్రమరాంబ మల్లికార్జున స్వామి పరిధిలో ఉన్న శ్రీశైలం జలాశయం (Srisailam Project) కు రోజు రోజుకు వరద నీరు పెరుగుతోంది. శుక్రవారం అధికారులు తెలిపిన వివరాల మేరకు… శ్రీశైలం జలాశయంలోకి 75,551 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతుంది. జూరాల (Jourala) నుంచి 49,903 క్యూసెక్కులు, స్పిల్ వే నుంచి 23,400 క్యూసెక్కుల నీరు, సుంకేసుల (sunkesula) నుంచి 2,248 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. ఇంతవరకు విద్యుత్ ఉత్పత్తికి నీరు వదలట్లేదు. శ్రీశైలం జలాశయం నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 848.49 అడుగులకు చేరుకుంది.

శ్రీశైలం నీటిమట్టం కెపాసిటీ 215.8070 టీఎంసీలు కాగా, ప్రస్తుతం డ్యామ్ లో నీటి నిలువ 76.3162 టీఎంసీలుగా నిల్వ ఉంది. రోజురోజుకు వరదనీరు శ్రీశైలం ప్రాజెక్టులోకి వస్తూ ఉంది. ఏగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాల వ‌ల్ల‌ జలాశయంలోకి నీరు ప్రవహిస్తోంది. గత పది రోజులుగా జలాశయంలోకి నీరు వస్తుంది. గత వారం రోజులుగా అధికారులు తెలిపిన వివరాలను పరిశీలిస్తే సోమవారం జలాశయంలోకి 21,860 క్యూసెక్కుల నీరు వచ్చింది. నీటిమట్టం 841.50 అడుగులు కాగా, నీటి సామర్థ్యం 64.0542 టీఎంసీలుగా ఉంది. మంగళవారం శ్రీశైలం జలాశయంలోకి భారీగా42,129 క్యూసెక్కుల నీరు వచ్చింది. నీటిమట్టం 843 అడుగులు కాగా, నీటి సామర్థ్యం 66.5540 టీఎంసీలుగా చేరుకుంది. బుధవారం జలాశయంలోకి 25,175 క్యూసెక్కుల నీరు చేరింది. నీటిమట్టం 844.20 అడుగులు కాగా, నీటి సామర్థ్యం 68.7145 టీఎంసీలకు చేరుకుంది.

గురువారం జలాశయంలోకి 37,385 క్యూసెక్కుల నీరు చేరుకుంది. నీటిమట్టం 846.20 అడుగులు కాగా నీటి సామర్థ్యం 72.3450 టీఎంసీలకు చేరుకుంది. శుక్రవారం కూడా జలాశయంలోకి భారీగా వరదనీరు వచ్చింది. రోజురోజుకు వరద నీరు పెరుగుతుండటం రుతుపవనాలు ముందుగానే రావడంతో రైతుల ఆనందం వ్యక్తం చేయడం విశేషం. ఖరీఫ్ సీజన్ (Kharif season) ప్రారంభమైన సందర్భంలో నీరు జలాశయంలోకి రావడంతో రాయలసీమ (Rayalaseema) ప్రాంత రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply