Rising 2047 Vision | గ్లోబల్​ సమ్మిట్​కు రండి..

Rising 2047 Vision | గ్లోబల్​ సమ్మిట్​కు రండి..

Rising 2047 Vision | ఢిల్లీ, ఆంధ్రప్రభ : ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్​ గాంధీ, ఎంపీ ప్రియాంక గాంధీ(MP Priyanka Gandhi)తో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్​ రెడ్డి భేటీ అయ్యారు. హైదరాబాద్​ భారత్ ఫ్యూచర్ సిటీలో ఈనెల 8, 9 తేదీల్లో నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్​ గ్లోబల్​ సమ్మిట్​(Rising Global Summit)కు రావాలని ప్రత్యేకంగా ఆహ్వానించారు.

భవిష్యత్తులో తెలంగాణ అభివృద్ధి, ఆదాయ వృద్ధి లక్ష్యంగా రూపొందించిన తెలంగాణ రైజింగ్​ 2047 విజన్(Rising 2047 Vision) డాక్యుమెంట్​ గురించి వివరించి.. ఆహ్వాన పత్రికను అందించారు. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఎంపీలు, ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ ఈ భేటీలో పాల్గొన్నారు.

Leave a Reply