Rishab Shetty | రెమ్యూనరేషన్ ఎంత డిమాండ్ చేస్తున్నాడంటే..?

Rishab Shetty | రెమ్యూనరేషన్ ఎంత డిమాండ్ చేస్తున్నాడంటే..?

  • కాంతారతో పాన్ ఇండియా స్టార్‌గా మారిన రిషబ్ శెట్టి
  • టాలీవుడ్‌లో రెండు భారీ ఆఫర్స్‌కు గ్రీన్ సిగ్నల్
  • ఒక్కో సినిమాకు 80 కోట్ల రెమ్యూనరేషన్ టాక్
  • మైత్రీ, సితార బ్యానర్లలో రిషబ్ చేయనున్న సినిమాలు
  • ప్రొడ్యూసర్ల రియాక్షన్ ఏంటి?

Rishab Shetty | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : కన్నడ స్టార్ రిషబ్ శెట్టి.. కాంతార సినిమాతో ఊహించని విధంగా సంచలనం సృష్టించాడు. కన్నడలో తీసిన ఈ సినిమాతో పాన్ ఇండియా (Pan India) రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఇటీవల కాంతార ప్రీక్వెల్ అంటూ కాంతార చాప్టర్ 1 తీసాడు. ఈ మూవీ కూడా పాన్ ఇండియా రేంజ్ లో బ్లాక్ బస్టర్ సాధించి రికార్డు కలెక్షన్స్ వసూలు చేసింది. దీంతో తెలుగులో భారీ ఆఫర్స్ రావడంతో రెండు సినిమాలు చేసేందుకు ఒకే చెప్పాడు. అయితే.. ఇప్పుడు రెమ్యూనరేషన్ భారీగా డిమాండ్ చేస్తున్నాడని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఇంతకీ.. టాలీవుడ్ లో ఏ ఏ బ్యానర్ లో సినిమాలు చేస్తున్నాడు..? రిషబ్ రెమ్యూనరేషన్ ఎంత డిమాండ్ చేస్తున్నాడు..?

Rishab Shetty

Rishab Shetty | కాంతార, కాంతార 1 చిత్రాలతో రిషబ్ శెట్టి..

జాతీయ స్థాయిలోనే కాదు.. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇంతలా క్రేజ్ తెచ్చుకోవడంతో రిషబ్ తో సినిమాలు చేసేందుకు టాలీవుడ్ లో (Tollywood) ప్రముఖ నిర్మాణ సంస్థలైన మైత్రీ మూవీ మేకర్స్, సితార ఎంటర్ టైన్మెంట్స్ సంస్థలు ముందుకు వచ్చాయి. రిషబ్ ఈ రెండు నిర్మాణ సంస్థల్లో సినిమాలు చేసేందుకు ఓకే చెప్పాడు. అయితే.. ఈ సినిమాల కోసం ఆయన రెమ్యూనరేషన్ భారీగా డిమాండ్ చేస్తున్నారనేది లీకైంది. ఇది నిజమో కాదో క్లారిటీ లేదు కానీ.. ఇండస్ట్రీలో మాత్రం హాట్ టాపిక్ అయ్యింది.

Rishab Shetty

Rishab Shetty | ఇంతకీ రిషబ్ ఎంత డిమాండ్ చేస్తున్నారంటే..

ఒక్కో సినిమాకు 80 కోట్ల పారితోషికం డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన ప్రస్తుతం మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో హనుమాన్ మూవీకి సీక్వెల్ జై హనుమాన్ (Jai Hanuman) చేయాలి. ఈ సినిమాతో పాటు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌ పై అశ్విన్ గంగరాజు దర్శకత్వంలో ఒక పీరియాడిక్ డ్రామాలో కూడా రిషబ్ భాగం కానున్నారు. ప్రస్తుతం ఈ రెండు సినిమాలకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ప్రస్తుతం ఈ రెండు సినిమాల పైనే ఫోకస్ పెట్టాడని సమాచారం. అయితే.. రిషబ్ డిమాండ్ పై ప్రొడ్యూసర్స్ ఎలా రియాక్ట్ అయ్యారు..? ఎంత రెమ్యూనరేషన్ ఇస్తున్నారు…? అనేది తెలియాల్సివుంది.

Rishab Shetty

CLICK HERE TO READ పెద్ది, ఫౌజీ పోటీపడడానికి కారణాలు ఇవే..

CLICK HERE TO READ MORE

Leave a Reply