హైదరాబాద్ – ప్రముఖ హిప్నాటిస్టు, మెజీషియన్ , వ్యక్తిత్వ వికాస నిపుణుడు డా. బీవీ పట్టాభిరామ్(B.V. Pattabhiram) కన్నుమూశారు. ఆయన వయస్సు 75 సంవత్సరాలు . హైదరాబాద్ లోని ఆయన నివాసంలో సోమవారం అర్థరాత్రి గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ నేడు మరణించారు. మానసిక వైద్యుడిగా, ఇంద్రజాలికుడిగా, రచయితగా ఆయన ప్రసిద్ధి చెందారు. తెలుగు. ఇంగ్లీష్, కన్నడ, తమిళ భాషల్లో పట్టాభిరామ్ రాసిన పుస్తకాలు బాగా ఫేమస్ అయ్యాయి. అలాగే విద్యార్థుల కోసం తెలుగు రాష్ట్రాల్లో వేలాది పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులు నిర్వహించారు. కాగా రేపు మధ్యాహ్నం ఆయన అంత్యక్రియలు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో జరగనున్నాయి. ఈ మేరకు కుటుంబ సభ్యులు సమాచారం ఇచ్చారు.. కాగా, పట్టాభిరామ్ మృతి పట్ల పలువురు సంతాపం ప్రకటించారు.
RIP | ప్రముఖ మెజిషియన్, హిప్నాటిస్ట్ బి వి పట్టాభిరామ్ కన్నుమూత
