నంద్యాల బ్యూరో మార్చి 21…… రాష్ట్ర మైనార్టీ న్యాయ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ సతీమణి షహనాజ్ శుక్రవారం తెల్లవారుజామున మరణించడం జరిగిందని బంధువులు తెలిపారు.ఉదయం 5 గంటలకు హైదరాబాదులో తన సొంత గృహంలో మరణించడం జరిగిందన్నారు. గత కొద్ది కాలంగా అనారోగ్యంగా ఉన్నట్లు తెలిపారు.
నంద్యాల నియోజకవర్గ శాసనసభ్యుడుగా ఉన్న ఎన్ఎండి ఫరూక్ గత 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నారు. ఈ స్థాయికి ఎదగటానికి భార్య సహకారం ఎంతో ఉందని బంధువులు పేర్కొనటం విశేషం. ఈమెకు ఐదుగురు కుమారులతో పాటు కూతుర్లు కూడా ఉన్నారని తెలిపారు.
వారి కుటుంబ సభ్యులంతా శోకసంద్రంలో మునిగిపోయారు.ఆమె మృతికి ఆమె కుటుంబ సభ్యులకు బంధువులు ప్రజాప్రతినిధులు రాజకీయ నాయకులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. హైదరాబాదులోని సొంత ఇంటిలో ఆమె బంధువుల కోసం దర్శనార్థం అక్కడే ఉంచారు.