ఇంటి వద్దే ఢీకొన్న కారు.. చికిత్స పొందుతూ మరణం
89 ఏట మారథాన్ రేస్ లలో ఎంట్రీ
పలు అంతర్జాతీయ పోటీలలో పతకాల పంట
114 వ సంవత్సరంలోనూ అదే ఫిజిక్
అథ్లెటిక్ మరణం పట్ల మోదీ సంతాపం
జలందర్ – చండీగర్ – మారథాన్ (Marathon ) ను పూర్తి చేసిన అత్యధిక వయస్కుడిగా (aged Athlete) ప్రపంచ రికార్డు (world record ) సృష్టించిన పౌజా సింగ్ (Fouzi singh ) ఓ రోడ్డు ప్రమాదంలో మరణించారు. సోమవారం జలంధర్ – పఠాన్ కోట్ జాతీయ రహదారిపై ఆయనను ఓ కారు ఢీ (car Collision ) కొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రగాయాలపాలైన ఫౌజా సింగ్ ను స్థానికులు హుటాహుటిన దగ్గర్లోని ఆసుపత్రిలో చేర్పించారు. ఈ ప్రమాదంలో ఫౌజా సింగ్ తలకు తీవ్ర గాయమైందని, రక్తస్రావం కారణంగా ఆయన తుదిశ్వాస (last breath ) వదిలారని వైద్యులు ప్రకటించారు.
పంజాబ్ లోని జలంధర్ జిల్లా బేయాస్ గ్రామంలో 1911 ఏప్రిల్ 1న ఫౌజా సింగ్ జన్మించారు. ఆయనకు ప్రస్తుతం 114 ఏళ్లు. భార్య, కొడుకు మరణం తర్వాత ఫౌజా సింగ్ రన్నింగ్ ప్రాక్టీస్ చేశారు. 89 ఏళ్ల వయసులో మొదలు పెట్టిన పరుగును వందేళ్లు దాటినా ఆపలేదు. ఈ వయసులోనూ ఫౌజా సింగ్ ఉత్సాహంగా పరుగులు తీసి రికార్డులకెక్కారు. పలు మారథాన్లను పూర్తిచేసిన ఘనతను సొంతం చేసుకున్నారు. 114 యేళ్ల వయస్సులో ఫిట్‌నెస్‌ను సవాల్ చేస్తూ ప్రపంచవ్యాప్తంగా గుర్తుండిపోయే సింగ్‌ను టర్బన్డ్ టోర్నడో అని పిలుస్తారు. ‘సిక్కు సూపర్‌మ్యాన్’ గా పిలువబడే ఫౌజా సింగ్ 2000 సంవత్సరంలో లండన్ మారథాన్‌లో జరిగిన మారథాన్‌లోకి 89 సంవత్సరాల వయసులో అడుగుపెట్టారు. తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి గడించాడు. లండన్, న్యూయార్క్, టొరంటో లలో జరిగిన మారథాన్ లలో ఫౌజా సింగ్ పాల్గొన్నారు.
ఫౌజా సింగ్ మరణంపై పంజాబ్ గవర్నర్ గులాబ్ చంద్ కటారియా విచారం వ్యక్తం చేశారు. వందేళ్లు దాటినా ఉత్సాహంగా పరుగులు తీస్తూ యువతకు ఆయన స్ఫూర్తిగా నిలిచారని అన్నారు.
ప్రధాని మోదీ సంతాపం …
ఫౌజా సింగ్ మృతిపట్ల ప్రధాని మోదీ మంగళవారం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెటరన్ మారథాన్ రన్నర్ ఫౌజా సింగ్ మృతి పట్ల ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేస్తూ ఆయన కుటుంబానికి సంతాపం తెలిపారు. 114యేళ్ల వయసులో కూడా ఫౌజాసింగ్ ఫిట్ నెస్, ప్రత్యేక వ్యక్తిత్వం గల వెటరన్ మారథాన్ యువతకు ఆదర్శనం అన్నారు ప్రధాని మోదీ. సింగ్ అద్భుతమైన దృఢ సంకల్పం కలిగిన అసాధారణమైన అథ్లెట్ అని ప్రధాని మోదీ తన సోషల్ మీడియాలో ఫ్లాట్ ఫాం ఎక్స్ లో పోస్ట్ చేశారు.