హైదరాబాద్ – ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు మరణం పట్ల పలువరు సినీ ప్రముఖులు (cine celebrities ) సంతాపం (condolence ) ప్రకటించారు.. ఆయన లేని లోటు ఎవరూ తీర్చలేరంటూ తమ సందేశాలలో (messages) పేర్కొన్నారు. కాగా, మెగాస్టార్ చిరంజీవితో (chiranjeevi) సహా పలువురు నటినటులు, సాంకేతిక నిపుణులు కోటా నివాసానికి వెళ్లి ఆయన బౌతికకాయంపై పుష్పగుచ్చాలు ఉంచి నివాళులర్పించారు.. కోట బౌతికకాయాన్ని చూసి బాబు మోహన్ (babu mohan), బ్రహ్మనందం (brahmanandam ) బోరున విలపించారు
విభిన ప్రాతకు ఆయన చిరునామా – చిరంజీవి
లెజెండరీ నటులు, బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ కోట శ్రీనివాస రావు గారు ఇక లేరనే వార్త నన్ను తీవ్రంగా కలిచివేసింది. ‘ప్రాణం ఖరీదు’ చిత్రంతో ఆయన, నేను ఒకేసారి సినీ కెరీర్‌ను ప్రారంభించాం. ఆ తర్వాత వందలాది సినిమాల్లో ఎన్నెన్నో విభిన్నమైన పాత్రల్లో నటించి, ప్రతి పాత్రనీ తన విలక్షణమైన, ప్రత్యేక శైలితో అలరించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఇటీవలి కాలంలో ఆయన కుటుంబంలో జరిగిన వ్యక్తిగత విషాదం ఆయన్ని మానసికంగా ఎంతగానో కుంగదీసింది. కోట శ్రీనినివాస రావు గారి లాంటి నటుడి లోటు చిత్ర పరిశ్రమకి, సినీ ప్రియులకి ఎన్నటికీ తీరనిది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకి, శ్రేయోభిలాషులకి, అభిమానులకి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
విభన్న శైలికి ప్రాణ ప్రతిష్ట చేసిన మహానటుడు – ఎన్టీఆర్
కోట శ్రీనివాసరావు గారు… ఆ పేరే చాలు. ఎనలేని నటనా చాతుర్యం. ప్రతి పాత్రలో తనదైన శైలిలో ప్రాణం పోసిన మహానటుడు ఆయన. నా సినీ ప్రయాణంలో ఆయనతో నటించిన, పంచుకున్న క్షణాలు ఎప్పటికీ చిరస్మరణీయం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు, ఆత్మీయులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
వెలకట్టలేని నటన ఆయనది – రామ్‌గోపాల్ వర్మ
సినీ రంగంలో ఉన్న అతి కొద్దిమంది గొప్ప నటుల్లో కోట శ్రీనివాసరావు ఒకరనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన నటనతో నా సినిమాలు ‘శివ’, ‘గాయం’, ‘మనీ’, ‘సర్కార్’, ‘రక్త చరిత్ర’ మరింత ప్రభావవంతంగా వచ్చాయి. అది వెలకట్టలేనిది. కోట శ్రీనివాసరావు గారు మీరు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయి ఉండవచ్చు కానీ, మీ పాత్రలు బతికే ఉంటాయి.
ఆయనే స్ఫూర్తి – రవితేజ
కోట శ్రీనివాసరావును చూస్తూ, ఆరాధిస్తూ.. ఆయన్నుంచి నేర్చుకుంటూ పెరిగాను. ఆయన నా కుటుంబంలో వ్యక్తిలాంటి వారు. ఆయనతో కలిసి పని చేసిన క్షణాలు నాకు తీపి జ్ఞాపకాలు. కోట శ్రీనివాసరావు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను.
కోట ఓ అద్భుత కళాకారుడు – రాజమౌళి
కోట శ్రీనివాసరావు గారి మరణ వార్త విని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. ఆయన ఒక అద్భుతమైన కళాకారుడు, ప్రతీ పాత్రకు ప్రాణం పోసిన గొప్ప నటుడు. తెరపై ఆయన ఉనికి నిజంగా ఎప్పటికీ భర్తీ చేయలేనిది. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి.
ఇతర నటులకు ఆయన స్ఫూర్తి ప్రదాత – ప్రకాష్ రాజ్ ..
కోట మృతిపై విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ తన సంతాపం తెలియజేశాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోట గారి సినిమాలు చూసి చాలా స్పూర్తి పొందానని, ఎన్నో సినిమాల్లో కలిసి నటించామని ఆయన ఎంతో విశిష్డ మైన వ్యక్తి అని.. అందరికీ నచ్చడు.. ఎవరిని మెప్పించటానికి ప్రయత్నం చేయడని, ఆయనది ఒక ప్రజెన్స్ అని.. తన మాటల్లో ఓ వ్యంగ్యం ఉండేది అన్నారు.