Ring symbol | అమ్మలా అందరికీ అందుబాటులో ఉంటా…
- ప్రజా సేవకు సిద్ధమంటున్న సర్పంచ్ అభ్యర్థి కాసిపేట వెంకటమ్మ…
- ఉంగరం గుర్తుకు ఓటెయ్యండి అభివృద్ధి చేసి చూపిస్తా
Ring symbol | మంథని, ఆంధ్రప్రభ : మంథని మండలం ఉప్పట్ల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా కాసిపేట వెంకటమ్మ బరిలో ఉన్నారు. ఎన్నికల సంఘం వారు ఉంగరం గుర్తు(Ring symbol) కేటాయించారు. ఉంగరం గుర్తుకు ఓటేసి ఆశీర్వదించాలని ఆమె కోరుతున్నారు. మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో ఉప్పట్ల గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని ఆమె హామీ ఇచ్చారు.
అంబేద్కర్ వారసురాలిగా వస్తున్నానని, ప్రజల కష్టం విలువ తెలుసని, ప్రజల్ని కన్నబిడ్డలా చూసుకుంటానని అవకాశం కల్పించాలని ఆమె కోరుతున్నారు. మంత్రి శ్రీధర్ బాబు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీనుబాబు సహకారంతో మంథని మండలంలోని ఉప్పట్ల గ్రామాన్ని పతాక స్థాయి(flag level)లో అభివృద్ధి చేసి చూపిస్తానని ఆమె స్పష్టం చేశారు. ప్రజా సేవకు సిద్ధమై గ్రామంలోని ప్రతి వార్డు గడపగడపకు ఆమె ప్రచారంలో దూసుకు వెళ్తున్నారు.
ఆమెకు తోడుగా ఆమె తనయుడు కాసిపేట బాపు ఎన్నికల్లో సహకారం అందించనున్నారు. కాసిపేట బాపు గత ఎన్నికల్లో విజయ తీరాల వరకు వచ్చి కేవలం తక్కువ ఓట్లతో మాత్రమే విజయాన్ని అందుకోలేకపోయారు. ఈసారి ఎన్నికల్లో తన తల్లి కాసిపేట వెంకటరమను గెలిపించి ఊరిని అభివృద్ధి చేస్తానని(development) కాసిపేట బాపు ఎన్నికల ప్రచారంలో దూసుకు వెళ్తున్నారు.
ప్రజలంతా కాసిపేట వెంకటమ్మ విజయం సాధించడం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. సర్పంచ్ గా గెలిచిన తర్వాత ఉప్పట్ల గ్రామంలో యువత, మహిళల అభివృద్ధి కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపడతానని ఆమె పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తానని ఆమె వివరించారు. గ్రామంలోని ప్రతి ఇంటికి రక్షణగా ఉంటూ ప్రజలందరికీ అందుబాటులో ఉంటానని ఆమె పేర్కొన్నారు. ఉంగరం గుర్తుకు ఓటేసి ఆశీర్వదించాలని ఉప్పట్ల గ్రామ ప్రజలు కోరుతున్నారు.

