ఆసియా ఖండంలోనే పేరొందిన నల్గొండ జిల్లా మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా గౌరు శ్రీనివాస్ ఎన్నికయ్యారు. ప్రతి రెండేళ్లకోసారి మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా జరుగుతాయి.
స్థానిక రైస్ మిల్లర్స్ అసోసియేషన్ భవనంలో ఈరోజు ఎన్నికలు జరిగాయి. అధ్యక్షుడిగా గౌరు శ్రీనివాస్, ఉపాధ్యక్షుడిగా గోళ్ళ రామ్ శేఖర్, కార్యదర్శిగా బోగవిల్లి వెంకటరమణ చౌదరి, కార్యదర్శి-2 గా పోలిశెట్టి ధనుంజయ, కోశాధికారిగా గందె రాము ఎన్నిక కాగా..
కార్యవర్గ సభ్యులుగా గౌరు శంకర్, నీలా పాపారావు, పోతుగంటి కృష్ణ, మలిగిరెడ్డి మాధవ రెడ్డి, రాయిని శ్రీనివాస్, కొమ్మన పట్టాభిరామ్, గుంటి గోపి, ఆతుకూరి గురునాథం, గుర్రం వెంకటరత్నం, శ్రీరంగం నర్సయ్యలు ఎన్నికయ్యారు. వీరు రెండేళ్ల పాటు ఆయా పదవుల్లో కొనసాగనున్నారు.
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నిక అయిన అధ్యక్షుడు గౌరు శ్రీనివాస్ మాట్లాడుతూ తనపై నమ్మకం తో ఇంతటి ప్రతిష్టాత్మక మైన బాధ్యత ఇచ్చిన మిల్లర్లు అందరికి మంచి చేయడానికి శక్తి మేరకు పని చేస్తాం అని ప్రభుత్వ పెద్దలు సహకారంతో అన్నదాత లకు వ్యాపారస్తులకు వారధి గా అందుబాటులో ఉంటాము అని అన్నారు. సహచర సభ్యుల అందరి అభిమానంతో ముందుకు వెళ్తాము అని తెలియజేసారు. నూతనం గా ఎన్నికైన కార్యవర్గాన్ని స్నేహితులు సన్నిహితులు అభినందించారు.
