ప్రాణాలు కోల్పోయిన అన్న‌దాత‌

ప్రాణాలు కోల్పోయిన అన్న‌దాత‌

ఎండపల్లి, ఆంధ్రప్రభ : మండలంలో మారేడుపల్లి(Maredupally) గ్రామానికి చెందిన బింగి సతీష్ అనే రైతులు ఈ రో్జు పొలంలో వ్య‌వ‌సాయ ప‌నులు చేస్తుండ‌గా విద్యుద్ఘాతంతో ప్రాణాలు కోల్పోయాడు. ఉద‌యం పొలంలో పురుగుల మందు(Pesticide) వేయ‌డానికి రైతు బింగి స‌తీష్ వెళ్లాడు. పురుగుల మందు కొడుతూ చూసుకోకుండా విద్యుత్ వైర్ల‌పై అడుగు వేయ‌డంతో విద్య‌త్ షాక్‌కు గురై మృతి చెందాడు.

పొలాల్లో ఉన్న రైతులు ఇది గ‌మ‌నించి పోలీసుల‌(police)కు స‌మాచారం ఇచ్చారు. స‌మాచారం అందుకున్న పోలీసులు సంఘ‌ట‌న స్థ‌లానికి చేరుకుని వివ‌రాలు సేక‌రిస్తున్నారు. ఈ సంఘటన తో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Leave a Reply