Rice crop planting | యాసంగి పంటలకు సిద్ధమవుతున్న రైతన్నలు

Rice crop planting | నిజాంపేట, ఆంధ్రప్రభ : మండల వ్యాప్తంగా రైతులు యాసంగి వరి పంట నాట్లకు సిద్ధమవుతున్నారు. ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురవడం బోర్లు మంచిగా పోయడంతో రైతన్నలు వరి నాట్లకే మొగ్గు చూపుతున్నారు. మరి కొందరు రైతులు చాలా మంది మొక్కజొన్న పంటలు వేయడం జరిగింది. ఏది ఏమైనాప్పటికీ రైతులు మాత్రం వరి పంటలకే మొగ్గు చూపుతున్నారు. ఈసారి మంచు తీవ్రత ఎక్కువగా ఉండడంతో వరితుకాలు పెరగడం లేదు. అదేవిధంగా వాతావరణ పరిస్థితుల అనుగుణంగా వరి నాట్లు వేసేటప్పుడు తగు జాగ్రత్తలు చేపట్టాలని అధికారులు సూచిస్తున్నారు.

Leave a Reply