రైస్ గోదాంలో ఘనంగా మహిళా దినోత్సవం

రైస్ గోదాంలో ఘనంగా మహిళా దినోత్సవం

తొర్రూరు, ఆంధ్రప్రభ : ధర్మశ్రీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తొర్రూరు డివిజన్ కేంద్రంలోని రైస్ గోదాంలో శనివారం మహిళా దినోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకున్నారు. గోదాంలో మహిళా హమాలీని సన్మానం చేశారు. ఈ సందర్భంగా ధర్మశ్రీ చారిటబుల్ ట్రస్ట్ చైర్ పర్సన్ ధరావత్ విమల మాట్లాడుతూ రైస్ గోదాంలో మహిళ హమాలి బస్తాలు మోయడం గర్వకారణమని చెప్పారు. ఆమెను ఆదర్శంగా తీసుకొని ప్రతి మహిళలు కూడా శ్వాసక్తులతో ముందుకు కొనసాగించాలని కోరారు.

సౌజన్య గత కొన్ని సంవత్సరరాలుగా ఇదే రైస్ హమాలీ పని చేయడం చేసుకుంటూ తన కుటుంబాన్ని చేదోడు వాదోడుగా సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైస్ గోదాం మేనేజర్ ధరావత్ నెహ్రూ మాట్లాడుతూ గోదాంలో ధర్మశ్రీ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ముందు ముందు కూడా ఇలాగే గోదాంలలో పనిచేస్తున్న మహిళా సోదరీమణులను గౌరవించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సంతోష్, సిబ్బంది లింగయ్య,సుధాకర్, ప్రభాకర్, రామచంద్ర, ఉప్పల చంద్రు, యాకూబ్ రెడ్డి, టైపిస్ట్ రైతులు పాల్గొన్నారు.

Leave a Reply