WGL | మహా జాతర ఏర్పాట్లపై సమీక్ష సమావేశం…

ఆంధ్రప్రభ ప్రతినిధి, ములుగు : 2026 జనవరిలో జరగనున్న మహా జాతర ఏర్పాట్లను పరిశీలించేందుకు రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ దివాకర్ టి.ఎస్‌తో పాటు సంబంధిత శాఖల అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
సమీక్ష సందర్భంగా మేడారంలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై మంత్రి అధికారులు నుండి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. ఆలయ ప్రాంగణ అభివృద్ధి, ప్రహరి గోడలు, రహదారి నిర్మాణం వంటి కీలక పనులను వేగవంతంగా పూర్తి చేయాలని మంత్రి సీతక్క ఆదేశించారు.
వనదేవతలను దర్శించుకున్న మంత్రి సీతక్క
కాగా, అంతకముందు.. మేడారం సమ్మక్క సారాలమ్మ లను మంత్రి సీతక్క దర్శించుకున్నారు. ముందుగా పూజరులు సంప్రదాయంగా డోలు వైయిద్యాలతో ఘనంగా గద్దెల వద్దకు స్వాగతం పలికారు. అనంతరం తల్లులకు ప్రత్యేక పూజలు చేశారు. దేవాదాయ శాఖ అధికారులు మంత్రిని సన్మానించి, లడ్డు ప్రసాదాలు అందజేశారు.
ఈ కార్యక్రమం లో మార్కెట్ చైర్ పర్సన్ రెగా కళ్యాణి, గ్రంధాలయం చైర్మన్ రవి చందర్, కలెక్టర్ దివాకర్ టీ ఎస్,పి ఓ చిత్ర మిశ్ర,సీఐ దయాకర్,తహసీల్దార్ సురేష్ బాబు,ఎస్ ఐ శ్రీకాంత్ రెడ్డి,పూజారి రానా రమేష్,పీరీల వెంకన్న, దేవాదాయ అధికారులు జగదీశ్, పూజారులు ఇతర అధికారులు పాల్గొన్నారు.

