Review meeting | గ్రామ స్థాయిలో కమిటీల నియామకం చేపట్టాలి..

Review meeting | వెల్దండ, ఆంధ్రప్రభ : గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ గెలుపునకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ అన్నారు. అచ్చంపేట నియోజకవర్గంలో జరిగే మున్సిపల్ ఎలక్షన్ లో సమీక్ష సమావేశం సందర్భంగా సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ ఆధ్వర్యంలో ఈ రోజు వెల్దండ మండల కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మండల పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారిని సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ… గ్రామ పంచాయితీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం కోసం కృషి చేసిన నాయకులకు, కార్యకర్తలకు, కృతజ్ఞతలు తెలిపారు.
రానున్న మునిసిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్ధుల గెలుపుకొరకు ప్రతి ఒక్కరు అహర్నిశలుగా కృషి చేయాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ భూపతి రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మోతీలాల్ నాయక్, తాలూకా కిసాన్ సెల్ అధ్యక్షుడు పర్వత్ రెడ్డి, ఉప సర్పంచ్ బస్నమోని శ్రీనివాస్, 2 వార్డ్ మెంబర్ రంగనాథ్, 3వ వార్డ్ మెంబర్ గుద్దటి కిష్టల్, 6వ వార్డ్ మెంబర్ మారేపల్లి శ్రీను, 9వ వార్డు మెంబెర్ ముదికొండ రమేష్,13వ వార్డు మెంబెర్ పురుషోత్తం, కాంగ్రెస్ పార్టీ సీనియరు నాయకులు చీముల తిరుపతి రెడ్డి, ఎండీ అమీదు, కొయ్యల పుల్లయ్య, తక్కలపల్లి శేఖర్, హరికిషన్ నాయక్, కృష్ణముదిరాజ్, ఎండి రషీద్ , రేవల్లి రాజు, దాసరి మహేష్ జంగిలి ఆనంద్, బొక్కల శ్రీనివాస్, భరత్, డేవిడ్, రమేష్ సందీప్, ఎండి సమీర్ తదితరులు పాల్గొన్నారు.
