టెహారాన్ – మొన్నటి వరకు హమాస్ తో (Hamas) యుద్ధం చేసిన ఇజ్రాయేల్ (Israel ) ఇప్పుడు ఇరాన్ తో తలపడుతున్నది.. ఇరాన్ (Iran) లో అణు కేంద్రాలే (Nuclear Plants ) లక్ష్యంగా గత అర్ధరాత్రి వైమానిక దాడి చేసింది ఇజ్రాయేల్ .. ఈ దాడిలో ఏకంగా ఇరాన్ మిలటరీ చీఫ్, ఇద్దరు అణు శాస్త్రవేత్తలు , పలువురు రివల్యూషనరీ గార్డ్స్ ఉన్నతాధికారుల మరణించారు.. దీంతో కొద్ది సేపటి క్రితం ఇరాన్ ప్రతికార దాడికి (Revenge ) దిగింది.. ఏకంగా వందలాది డ్రోన్ల తో ఇజ్రాయేల్ భూభాగంపై విరుచుకుపడింది. దీంతో వాటిని తమ వైమానికి రక్షణ వ్యవస్థతో కూల్చివేయడం ప్రారంభించింది.. ఇజ్రాయేల్ ఆర్మీ కూడా రంగంలోకి దిగింది. అలాగే మరోసారి ఇజ్రాయేల్ వైమానికి దాడికి సన్నాహాలు చేస్తున్నది.. ప్రస్తుతం ఇజ్రాయేల్ అత్యవసర పరిస్థితిని విధించారు.. పౌరులందరూ బంకర్లలో (Bunker) తలదాచుకోవాలని ప్రభుత్వ సూచించింది.
Revenge | ఇరాన్ ప్రతీకార దాడి – వందల కొద్ది డ్రోన్లతో ఇజ్రాయేల్ పై ఎటాక్
