TG | ఛత్రపతి శివాజీకి రేవంత్ రెడ్డి పుష్పాంజలి…
హైదరాబాద్, ఆంధ్రప్రభ : ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో జరిగిన ఒక కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ మహనీయుడి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ… భారతదేశానికి అపారమైన సేవలు అందించిన శివాజీ మహారాజ్ వీరత్వం, పరిపాలనా నైపుణ్యం స్ఫూర్తిదాయకమని ఆయన పేర్కొన్నారు.
ఈకార్యక్రమంలో రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యేలు వాకాటి శ్రీహరి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తదితరులు పాల్గొని శివాజీ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. శివాజీ మహారాజ్ ధైర్యసాహసాలు, పరిపాలనా విధానాలు నేటి తరానికి మార్గదర్శకంగా ఉంటాయని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా శివాజీ మహారాజ్ ఆశయాలను కొనసాగిస్తూ ప్రజల సేవలో ప్రతి నాయకుడు పనిచేయాలని నేతలు సంకల్పం వ్యక్తం చేశారు.