Revanth Reddy | ఆదిలాబాద్ అభివృద్ధి బాధ్యత నాదే!!

Revanth Reddy | ఆదిలాబాద్ అభివృద్ధి బాధ్యత నాదే!!

  • ఆదిలాబాద్ కు ఏయిర్ పోర్టు,
  • జిల్లాకు యూనివ‌ర్సిటీ
  • ఆదిలాబాద్‌కు సీఎం వ‌రాలు..

ఉమ్మ‌డి ఆదిలాబాద్ బ్యూరో, ఆంధ్ర‌ప్ర‌భ : ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆదిలాబాద్‌కు వ‌రాలు కురిపించారు. ప్ర‌భుత్వ రెండేళ్ల విజ‌యోత్సల సంద‌ర్భంగా ఈ రోజు ఆదిలాబాద్‌లో రేవంత్ రెడ్డి ప్ర‌సంగించారు సీఎం రేవంత్. ఈ సంద‌ర్భంగా ఆదిలాబాద్‌ను అభివృద్ధి చేసే బాధ్య‌త ప్ర‌జాపాల‌న తీసుకుంటుంద‌ని ప్ర‌క‌టించారు.

సీఎం ప్ర‌సంగంలో ముఖ్య‌మైన అంశాలు…

  • ఎన్నికలు వచ్చినప్పుడే మాత్ర‌మే రాజకీయాలు. ఎన్నికలు ముగిసిన వెంటనే అభివృద్ధి చేయడం మా ల‌క్ష్యం.
  • సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా కాంగ్రెస్‌ ప్రభుత్వం పనిచేస్తోంది. రెండేళ్లలో ఒక గంట కూడా సెలవు తీసుకోలేదు.
  • చిన్న వయస్సులోనే దేవుడు ముఖ్య‌మంత్రిగా నాకు అవకాశం ఇచ్చాడు. దేవుడు ఇచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని తెలంగాణ ప్రజలకు సేవ చేస్తున్నాను.
  • ఎర్ర‌బ‌స్సు రావ‌డమే క‌ష్ట‌మైన ఆదిలాబాద్ జిల్లాకు ఎయిర్ బ‌స్సు తీసుకొస్తా.. ఏడాదిలోపు ప‌నులు ప్రారంభిస్తా.. ఇక్క‌డ ఎయిర్‌పోర్టు అయితే ప‌రిశ్ర‌మాభివృద్దికి దోహ‌దం ప‌డుతుంది.
  • ఇంద్రవెళ్లిని పర్యాటక కేంద్రం ఏర్పాటు చేస్తా… కొమురం బీమ్ ను ఆదర్శం తీసుకుని… గ‌త‌ ప్రభుత్వంపై ఈ గడ్డ నుంచి పోరాటం చేశాం.
  • ఇంద్రవెళ్లి అమరుల స్తూపాన్ని పర్యటక కేంద్రంగా చేస్తాను.
  • ఆదిలాబాద్‌ జిల్లాను అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటాను.
  • రానున్న రెండు నెలల్లో సమీక్ష సమావేశాలను నిర్వహిస్తాను. జిల్లా సమస్యలకు పరిష్కరించి, అభివృద్ధికి నిధులు ఇస్తా..
  • ఆదిలాబాద్ జిల్లా వ్యవసాయ భూములకు గోదావరి నీరు అందిస్తాం. ప్రాణహిత-చేవేళ్ల ప్రాజెక్టులను కడతాం.
  • మీకు సాగు నీరు అందించే బాధ్యత ప్రజాపాలన తీసుకుంటుంది. ఎంత ఖర్చయినా తుమ్మడిహెట్టి వద్ద ప్రాణహిత ప్రాజెక్టు కడతాం.
  • ప్రైవేటు పెట్టుబడుదారులను తీసుకువచ్చి సిమెంట్‌ పరిశ్రమలను ప్రారంభించే విధంగా ప్రజాపాలన చర్యలు తీసుకుంటుంది.
  • ఆదిలాబాద్ జిల్లాకు యూనివ‌ర్సిటీ మంజూరు చేస్తాను. ఎక్క‌డ ఏర్పాటు చేయాలో ఒక అభిప్రాయానికి రండి. త‌లో దిక్కు అయితే నాకు ఇబ్బంది. ఆ పంచాయితీలోకి నాకు లాగొద్దు. అనుమ‌తి ఇస్తాను. ఇంద్రవెళ్లిలో యూనివర్సిటీ ఏర్పాటు చేస్తే బాగుంటుంది. కొమురం భీమ్ పేరు పెట్ట‌డం కూడా బాగుంటుంది. ఇది సూచ‌న మాత్ర‌మే !

Leave a Reply