RETRO టైటిల్ టీజర్ విడుదల..

కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో కోలీవుడ్ నటుడు సూర్య అప్‌కమింగ్ మూవీ ‘రెట్రో. ఈ చిత్రంలో సూర్య సరసన పూజా హెడ్గే నటిస్తుంది.

భారీ అంచనాలున్న “రెట్రో” చిత్రం మే1న థియేటర్లలోకి రానుంది. కాగా, తాజాగా ఈ సినిమా తెలుగు వెర్షన్ టైటిల్ టీజర్‌ను చిత్ర నిర్మాతలు విడుదల చేశారు. దాంతో పాటు హిందీ వెర్షన్ కూడా విడుదలైంది. ఈ విషయాన్ని చిత్ర బృందం సోషల్ మీడియాలో కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది.

ఇంటెన్స్, మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో జయరామ్, కరుణాకరన్, జోజు జార్జ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని స్టోన్ బెంచ్ ఫిల్మ్స్, 2డి ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సంతోష్ నారాయణన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *