కౌన్సిలర్ రేసులో సీనియర్ సిటిజన్లు..!

మోత్కూర్ , ఫిబ్రవరి 5 (ఆంధ్రప్రభ)మోత్కూర్ మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్ అభ్యర్థులుగా ముగ్గురు సీనియర్ సిటిజన్లు బరిలో నిలిచారు. 1 వ వార్డులో రిటైర్డ్ ప్రదానోపాధ్యాయులు, సామాజిక సేవకుడు మోత్కూర్ బ్రహ్మచారి (68 ) బిజెపి అభ్యర్థిగా, 2 వ వార్డ్ లో మర్రి మరియమ్మ( 74) బిఆర్ఎస్ అభ్యర్థిగా, 4 వ వార్డ్ లో దొంతర పోయిన భారతమ్మ (78 ) స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. ఏడుపదుల వయసులోనూ… ప్రజాసేవ చేయాలన్న ఉద్దేశంతో బలులోకి దిగినట్లు తెలిపారు. ఆయా వార్డులలో తమ మద్దతుదారులతో పార్టీ కార్యకర్తలతో కలిసి విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.
