Restrictions | చైనాలో విదేశీ భామ‌ల‌తో పెళ్లిళ్ల నిషేధం – అతిక్ర‌మిస్తే ఏడేళ్లు జైలు

బీజింగ్ – ప్ర‌పంచంలోనే అత్య‌ధిక ముదురు బ్ర‌హ్మ‌చారులున్న దేశం చైనా. అక్క‌డ ఉన్న చ‌ట్టాల కార‌ణంగా వివాహం అనేది కాస్ట్లీ వ్య‌వ‌హారంగా మారిపోయింది.. గతంలో చైనా తెచ్చిన ఒక బిడ్డ పాలసీతో చాలా మంది ప్రస్తుతం పెళ్లిళ్లు కాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో పెళ్లిళ్ల రేటు తగ్గిపోవటంతో పాటు పెళ్లికాక మిగిలిపోతున్న అబ్బాయిలు కుప్పలుకుప్పలుగా పెరిగిపోవటం చైనా అబ్బాయిలను ఆందోళనకు గురిచేస్తోంది. ఇలా అయితే మూడు పదుల వయస్సు వచ్చినా పెళ్లికాకపోవటంపై చాలా మంది అడ్డదారులు తొక్కటం ప్రారంభించారు ఇది చైనా చట్టాలకు విరుద్ధంగా సమస్యలకు దారితీసింది.

బంగ్లాదేశీయుల‌తో పెళ్లి, డేటింగ్ వ‌ద్దే వ‌ద్దు

ఈ క్రమంలో బంగ్లాదేశ్ లోని చైనా ఎంబసీ తన పౌరులకు కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. చైనా పౌరులు విదేశీ సంబంధిత వివాహాల విషయంలో చట్టాన్ని ఖచ్చితంగా పాటించాలని వార్న్ చేసింది. వీడియో ప్లాట్‌ఫారమ్‌లలో క్రాస్-బోర్డర్ డేటింగ్ కంటెంట్ లేదా పెళ్లిళ్ల బ్రోకర్ల ద్వారా మోసపోవద్దని హెచ్చరించింది. అలాగే డబ్బులకు భార్యలను కొనుక్కోవద్దని స్పష్టం చేసింది. ఇదే క్రమంలో చాలా మంది రష్యా నుంచి మహిళలను పెళ్లి చేసుకునేందుకు కూడా ప్రయత్నిస్తున్నట్లు వెల్లడైంది.

విదేశీ భార్యను కొనటం అనే ఆలోచనను చైనా పౌరులు మానుకోవాలని, అలాగే బంగ్లాదేశ్ మహిళలను పెళ్లి చేసుకోవాలంటే ఒకటిరి రెండుసార్లు తిరిగి ఆలోచించుకోవాలని చెప్పింది. ఇవి వారిని ఆర్థికపరమైన, వ్యక్తిగత నష్టాల నుంచి కాపాడుతుందని పేర్కొంది. ఆన్‌లైన్ రొమాన్స్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలంది. చైనా చట్టాల ప్రకారం ఏదైనా మ్యాచ్ మేకింగ్ ఏజెన్సీ కూడా సరిహద్దు దాటిన వివాహ సంబంధాలను కుదిర్చే సేవల్లో పాల్గొనడానికి వీలు లేదని పేర్కొంది. లాభాల కోసం ఏ వ్యక్తులు లేదా సంస్థలు ఇలాంటి కార్యకలాపాలకు నిర్వహించకూడదని చైనా హెచ్చరించింది.

3 కోట్ల మంది పెళ్లి కాని ప్ర‌సాదులు

బంగ్లాదేశ్ లోని న్యాయ ప్రక్రియ ఆలస్యాల కారణంగా ఎవరైనా చైనా పౌరులు పొరపాటున మ్యారేజ్ స్కా్మ్ ద్వారా మానవ అక్రమ రవాణా అనుమానంతో అరెస్ట్ అయితే వారు నెలల తరబడి కోర్టుల చుట్టూ తిరగాల్సి ఉంటుంది. ఇది వారి జీవితంపై భారీ ప్రభావాన్ని చూపుతుందని చైనా ఎంబసీ హెచ్చరించింది. ప్రస్తుతం చైనాలో పెళ్లికాని ప్రసాదుల సంఖ్య దాదాపు 3 కోట్లకు పైనే ఉంది. అందుకే వాళ్లు తమ జీవిత భాగస్వామి కోసం వెతుకటం విదేశీ భార్యలకు డిమాండ్ పెంచేసింది.

ఈ క్రమంలో బంగ్లాదేశ్ మహిళలను వివాహం, లాభదాయకమైన ఉద్యోగాలు లేదా విద్యా అవకాశాల పేరుతో చైనాకు అక్రమ రవాణాలు పెరిగాయి. ఆ తర్వాత నేరస్థులు ఆ మహిళలను చైనీయులను వివాహం చేసుకోవాలని బలవంతం చేస్తున్న కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ఇవి పూర్తిగా చట్టవిరుద్ధమైనవి కాబట్టి చైనా పౌరులు అప్రమత్తంగా వ్యవహరించాలని రాయబార కార్యాలయం చెబుతోంది.

బంగ్లాదేశ్ చట్టాల ప్రకారం ఎవరైనా మానవ అక్రమ రావాణాకు పాల్పడితే.. ఏడేళ్లు లేదా జీవితకాలం జైలు శిక్ష విధించబడుతోంది. అలాగే అక్రమ రవాణాకు సహకరించే లేదా ప్లాన్ చేసిన వ్యక్తులకు 3-7 ఏళ్ల జైలు శిక్షతో పాటు సుమారు రూ.14వేల వరకు జరిమానా విధిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *