వేద రెస్టారెంట్ ను ప్రారంభించిన టీజిఐఐసీ చైర్ పర్సన్…

వేద రెస్టారెంట్ ను ప్రారంభించిన టీజిఐఐసీ చైర్ పర్సన్…
సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : సంగారెడ్డి కలెక్టరేట్ కార్యాలయం ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన వేద మల్టీ క్యుసిన్ రెస్టారెంట్ ను బుధవారం టీజిఐఐసీ చైర్ పర్సన్ నిర్మలజగ్గారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సంగారెడ్డి పట్టణం రోజురోజుకు విస్తరిస్తోందని, ఐఐటి హైదరబాద్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థలతో పాటు హైదరాబాద్ నగరానికి చేరువలో ఉండటంతో ఎంతో మంది సంగారెడ్డి నుండి నిత్యం రాకపోకలు నిర్వహిస్తున్నారని అన్నారు.
ప్రజల అవసరాల కు తగ్గట్టు గా అదే స్థాయిలో హోటళ్ళు, రెస్టారెంట్ లు, వ్యాపార సముదాయాలు ఏర్పడుతున్నాయని అన్నారు. వేద రెస్టారెంట్ ద్వారా ప్రజలకు నాణ్యమైన, ఆరోగ్యకరమైన భోజనం అందించాలని ఆకాక్షించారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ కూన వనిత, నాయకులు కూన సంతోష్, శ్రీశైలం, కౌన్సిలర్లు శైలేష్ రెడ్డి, రమేష్, రవి నాయక్, వంశీ యాదవ్, అశ్విన్ తదితరులు పాల్గొన్నారు.
