ఆంధ్రప్రభ కథనానికి స్పందన..
ప్రతినిధి /యాదాద్రి, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లాలోని భూదాన్ పోచంపల్లి(Bhoodan Pochampally) పట్టణ కేంద్రంలోని లీడల్ స్కూల్ పై ఈనెల 26న ప్రచురితమైన పసి ప్రాణాలతో చెలగాటం అనే శీర్షిక ఆంధ్రప్రభలో వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు. ఈ రోజు ఉదయం మున్సిపల్ కమిషనర్ అంజన్ రెడ్డి(Anjan Reddy) తన సిబ్బందితో కలిసి పాఠశాలను సందర్శించారు.


పాఠశాల సమయాల్లో నిర్మాణాలు చేపట్టవద్దని నోటీసులు జారీ చేశారు. నోటీసులను అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని యాజమాన్యాన్ని హెచ్చరించారు. అనంతరం తహసిల్దారు శ్రీనివాస్ రెడ్డి(Srinivas Reddy) తన సిబ్బందితో కలిసి పాఠశాలను పర్యవేక్షించి పరిశీలించారు. పాఠశాల యాజమాన్యం నిబంధనలు విస్మరిస్తే చట్టపరమైన చర్యలకు వెనుకాడేది లేదని యాజమాన్యానికి తెలిపారు.

