జగ్గయ్యపేట , ఆంధ్రప్రభ : ‘‘మూగజీవాల మనోవేదన’’ అనే శీర్షిక ఆంధ్రప్రభ కథనంపై వెటర్నరీ వైద్యుల బృందం జగ్గయ్యపేట పట్టణంలో పలు ప్రాంతాలలో ఆవులకు సోకిన చర్మ వ్యాధిని పరిశీలించారు. వెటర్నరీ సహాయ సంచారకులు ఏడి భవాని ప్రసాద్, మంగోల్లు పశు వైద్య అధికారి కే శ్రీను నాయక్, విజయవాడ వెటర్నరీ సర్జన్ డాక్టర్ ప్రవీణ్, విజయవాడ ల్యాబ్ టెక్నీషియన్ రాము తదితర బృందం పట్టణంలోని పలు ప్రాంతాలలో ఉన్న ఆవులకు సోకిన చర్మ వ్యాధి ని పరిశీలించారు.
ఆవులు, లేక దూడల ఆరోగ్య పరిస్థితి సమగ్ర పరిశీలన చేశారు. అనంతరం జగ్గయ్యపేట ప్రభుత్వ వసు వైద్య శాలలో మాట్లాడుతూ ఆవులకు సోకిన చర్మవ్యాధిని మొద్దు చర్మవ్యాధిగా గుర్తించడం జరిగిందన్నారు. ఆవుల చర్మంపై నల్లని మచ్చలు గడ్డలు ఉన్నట్లు గుర్తించడం జరిగిందని తెలిపారు.
దాదాపు చర్మవ్యాధితో ఉన్న అన్ని ఆవులలో ఈ చర్మవ్యాధి తగ్గేదశలో ఉన్నదని తెలిపారు. ఆవుల యజమానులు ఈ వ్యాధి సోకిన వెంటనే గుర్తించి పట్టణంలోని పశు వైద్యశాలకు తీసుకువస్తే వైద్యం అందించడం జరుగుతుందన్నారు. ఆవులలో దూడలలో మొదట గుర్తించడం జరిగిన వెంటనే కొన్ని రకాల టీకాలు వేయడం జరుగుతుందని అన్నారు.
రోడ్లపై సంచరించి ఆవులకు వాటిని పట్టుకొని టీకాలు వేయటం కోసం ఆవుల యజమానులు తప్పనిసరిగా ఉండాలన్నారు. ఆవులకు సంబంధించి యజమానులు వాటి సంరక్షణ విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోవటం లేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
జగ్గయ్యపేట మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రాన్ని పంపించడం జరిగిందని తెలిపారు. పట్టణంలో రోడ్లపై ఆవులు సంచరించకుండా చూడాలని కమిషనర్ను కోరటం జరిగిందన్నారు. పట్టణంలో ఆవులకు సంబంధించిన యజమానులు వాటి ఆరోగ్య పరిస్థితిపై పట్టించుకోకపోవడం సరైంది కాదన్నారు.
ఈ చర్మవ్యాధి సహజంగా ఆవులకు వస్తుందని అన్నారు. మొదట ఆవుల శరీరంపై కనులు గడ్డల లాగా మొదలై వారం పది రోజులలో చర్మంపై ఆ గడ్డలు కాలిన గడ్డల్లాగ మారి పగిలి నల్లని మచ్చలు ఏర్పడతాయని వివరించారు. జగ్గయ్యపేట ప్రాంతంలో ఇటువంటి ఆవులను పరిశీలించిన చెయ్యగా ఆవులలో వ్యాధి తీవ్రత పూర్తిస్థాయిలో తగ్గుదల లో ఉందని తెలిపారు.
ఆవుల శరీరంపై నల్లని మచ్చలు ఉండటంవల్ల ఆవుల చర్మవ్యాధి ఎక్కువగా ఉన్నట్లు తెలియనివారు అనుకుంటారన్నారు. వ్యాధి తగ్గుదల లోనే నల్లని మచ్చలు వస్తాయని స్పష్టం చేశారు.

