దోమల పెంట, : ఎస్ ఎల్ బి సీ టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న వారిని వెలికితీయడానికి కేంద్ర, రాష్ట్ర విపత్తు బృందాలతో పాటు ఆర్మీ, నేవి, సింగరేణి, కేంద్ర ప్రభుత్వ రహదారుల విభాగం, జేపీ, నవయుగ లకు చెందిన ఉన్నతాధికారుల బృందం ఇప్పటివరకు ఏడు సార్లు టన్నెల్ లో తనికీలు నిర్వహించాయి.
వీరి బృందంలో దాదాపు 584 నిపుణులైన సిబ్బంది ఉన్నారు. ఉత్తరాకండ్ లో జరిగిన విపత్తులలో ఈ బృందాలు రెస్క్యూ ఆపరేషనలను సమర్థవంతంగా నిర్వహించాయి. వీరితోపాటు 14 మంది ర్యాట్ ( ర్యాట్ హోల్ టీమ్)మైనర్స్ ల సేవలను ముమ్మరంగా ఉపయోగిస్తున్నారు. వీరితోపాటు , టన్నెల్ లో ఉన్న వారి ఆచూకి తెలుసుకునేందుకు స్నిప్పర్ డాగ్స్ లను కూడా రప్పించారు.అయితే, నీరు ఉన్నందున ఈ స్నిప్పర్ డాగ్స్ లోపలికి వెళ్లలేక పోయాయి. ఇప్పటికే డ్యామేజి అయిన కన్వీయర్ బెల్ట్ కు మరమ్మత్తులు చేపట్టారు.
కాగా, టన్నెల్ లోపలికి పై నుండి రంద్రం చేసి లోపలికి వెళ్ళాలన్న (వర్టికల్ డ్రిల్లింగ్ ) ప్రతిపాదనను తోసిపుచ్చారు. 5 గ్యాస్ కట్టింగ్ మిషన్లు రేయిం, పగల్లు పని చేస్తున్నాయి. కాగా, టన్నెల్ లో సహాయ కార్యక్రమాలను రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నేడు ఉదయం నుండి దోమలపెంట ప్రాజెక్టు సైట్ లో ఉండి పర్యవేక్షిస్తున్నారు.
మంత్రి కోమటిరెడ్డి సమీక్ష –

టన్నెల్ లో చిక్కుకున్న 8 మందిని రక్షించేందుకు అన్ని ప్రయత్నాలు చేయాల్సిందిగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
ఈ రోజు టన్నెల్ వద్ద జయ్ ప్రకాష్ సంస్థ క్యాంప్ కార్యాలయంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రాబిన్స్ టన్నెల్ కంపెనీ ప్రతినిధి గ్రేస్, ఎల్ & టీ కంపెనీ ప్రతినిధి, టన్నెల్ వర్క్స్ ఎక్స్ పర్ట్ ఇంజనీర్ క్రిస్ కూపర్ తో పాటు డిజాస్టర్ మేనేజ్ మెంట్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ.. అరవింద్ కుమార్, హైడ్రా కమీషనర్ ఏ.వి. రంగనాథ్, ఇండియన్ ఆర్మీ ప్రతినిధులు, ఎన్.డీ.ఆర్. ఆఫ్. ప్రతినిధులు, జయ్ ప్రకాష్ సంస్థ ప్రతినిధులు, ఇరిగేషన్ సీఈ అజయ్ కుమార్, ఇతర పోలీస్ ఉన్నతాధికారులతో రివ్యూ నిర్వహించిన మంత్రి.. సత్వర చర్యలతో టన్నెల్ లో చిక్కుకున్న వారిని కాపాడాలని ఆదేశించారు.
టన్నెల్ ప్రమాద ప్రాంతంలో బురదను తొలగిచేందు కోసం సాగునీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తో మాట్లాడటం జరిగింది.. ఈ రోజు 100 హెచ్.పి. మోటార్లు అరెంజ్ చేయడం జరిగిందనీ మంత్రి చెప్పారు.
ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది టన్నెల్ లో చిక్కుకున్నవారిని రక్షించే చర్యలు చేపట్టారన్నారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ప్రమాద ప్రాంతానికి చేరినట్టుగా ఎన్డీఆర్ఎఫ్ హెడ్ చెప్పడం జరిగిందనీ పేర్కొన్నారు . ఆ శ్రీశైలం మల్లికార్జునుడి దయతో వారంతా క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నానని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు.
రంగం లోకి ర్యాట్ హోల్ టీమ్
ఎస్ఎల్బీసీ లో చిక్కుకున్న కార్మికుల ప్రాణాలు కాపాడేందుకు ర్యాట్ హోల్ మైనర్స్ ను రంగంలోకి దింపింది ప్రభుత్వం. ప్రమాదంలో చిక్కుకున్న కార్మికుల్ని వెలికి తీసేందుకు ర్యాట్ హాల్స్ మైనింగ్ బృందాన్ని ఢిల్లీ నుండి హైదరాబాద్ కు తీసుకోచ్చింది. ఆదివారం రాత్రి 11:30 గంటలకు ప్రత్యేక విమానం ద్వారా ర్యాట్ హాల్స్ బృంద సభ్యులైన మహమ్మద్ రషీద్, ఖలీల్ ఖురేషి, నసీం, మున్నా, ఫిరోజ్ ఖురేషి, మహమ్మద్ ఇర్షాద్ లను రప్పించింది.
సోమవారం ఉదయానికి వీరంతా ఎస్ఎల్బీసీ కీ చేరుకొని ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు.
ఉత్తరకాశి ఘటనలో 41 మందిని కాపాడిన ర్యాట్ హోల్ మైనింగ్ టీమ్
ఉత్తరకాశి లో అక్కడి ప్రభుత్వం చేపట్టిన సొరంగం తవ్వకాలలో 2023 నవంబర్ లో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 41 మంది కార్మికులు చిక్కుకున్నారు. కార్మికులను బయటకు తీసుకోచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో రిస్కు ఆపరేషన్స్ చేశారు. ఉత్తరకాశి సియారా సొరంగంలో చిక్కుకున్న 41 మంది సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు 17 రోజులుగా సహాయక చర్యలు కొనసాగా యి. ఎన్డిఆర్ఎఫ్, బార్డర్ రోడ్డు ఆర్గనైజేషన్, నిష్ణాతులైనటువంటి సహాయక బృందాలే కాకుండా, అమెరికా నుంచి మైనింగ్ ఆపరేషన్లలో అపార అనుభవం ఉన్న సిబ్బందిని రంగంలోకి దించారు. అయితే ప్రతిసారి ఏదో ఒక అవరోధం ఏర్పడి కార్మికులు బయటకు తీసే చర్యలకు అవరోధాలు ఏర్పడ్డాయి.
హారిజంటల్ డ్రిల్లింగ్ చేసేందుకు అమెరికా నుండి తెప్పించిన 25 టన్నుల ఆగరు యంత్రం కూడా నాడు విఫలమైంది. దీంతో నాడు రాట్ హోల్ మైనింగ్ ను అక్కడి ప్రభుత్వం ప్రారంభించింది. మాన్యువల్ డ్రిల్లింగ్( ర్యాట్ హోల్ మైనింగ్) ద్వారా చేపట్టిన ఈ పద్ధతి ఫలితం సాధించింది.
కుప్పకూలిన సొరంగ మార్గంలో ఆరు పద్ధతుల్లో సొరంగంలో తవ్వకాలు జరిపి 41 మంది కూలీలను ప్రాణాలతో కాపాడగలిగారు. ఇదంతా కేవలం ఒకే రోజులో ర్యాట్ హోల్ మైనింగ్ టీం చేపట్టింది.
ర్యాట్ హోల్ మైనింగ్ అంటే ఏమిటి..?
ర్యాట్ హోల్ మైనింగ్ అనేది ఈశాణ్య రాష్ట్రాల్లో బొగ్గు తొలిచే పురాతన పద్దతి. పర్వత శ్రేణులు, సొరంగాల్లో సమాంతరంగా సన్నని పొరలు త్రోవ్వుతు బొగ్గు వెలికి తీసే ప్రక్రియనే ర్యాట్ హోల్ మైనింగ్ అంటారు. నాలుగు, ఐదు అడుగుల వెడల్పు లో నిర్దేశిత లక్ష్యంతో తవ్వకాలు చెప్పటి లక్ష్యాన్ని చేరుకుంటారు. మట్టి, బొగ్గు తవ్వే పరికరాలైన పార, తట్ట, చేతి పనిముట్లు, తాళ్లు తదితర సామాగ్రిని ఊపయోగిస్తారు. నిర్దేశిత ప్రాంతాన్ని ఎంచుకుని తవ్వకాలు జరిపి తొలగించిన మట్టిని కొంత దూరంలో డంప్ చేసి అక్కడి నుండి ట్రాలీల ద్వారా కిందికి తరలించి మార్గాన్ని ఎప్పటికప్పుడు సుగమం చేసుకుంటూ వెళ్తారు. ఇలా ఈ ప్రక్రియలో ఆరితేరిన వారు మాత్రమే ర్యాట్ హాలింగ్ మైనింగ్ లో పాల్గొంటారు. ఈ ఆపరేషన్ లో పాల్గొనే వారికీ ఆక్సీజన్ ను సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాల్సిన బాధ్యత మాత్రం అక్కడి ప్రభుత్వాలదే