గ్రావిటీ కాల్వ పనులు పూర్తి చేయాలని ఎమ్మెల్యేకు వినతి

కొడిమ్యాల, ఆంధ్రప్రభ : కొడిమ్యాల మండలంలోని పోతారం చెరువు నుంచి నాచుపెల్లి జేఎన్టీయూ కాలేజీ వరకు పెండింగ్లో ఉన్న గ్రావిటీ కాల్వ పనులను త్వరగా పూర్తి చేయాలని మాజీ సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కృష్ణారావు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు వినతి పత్రం అందజేశారు. ఈ వినతికి స్పందించిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, పెండింగ్ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు కృష్ణారావు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
