Request | విద్యార్థుల నిరసన

Request | విద్యార్థుల నిరసన
- పీఓకు వినతి
- సీఓఈ.. కాలేజీ తరలించ వద్దు
Request | ఉట్నూర్, ఆంధ్రప్రభ : ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని వెనుకబడిన కొలం గిరిజన ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఉట్నూర్ ఐటీడీఏ ద్వారా హైదరాబాదులోని హయత్ నగర్ లో ఏర్పాటు చేసిన (తెలంగాణ గిరిజన సంక్షేమ ప్రతిభ కళాశాల )సిఓఈ కాలేజీని సంగారెడ్డి జిల్లాలోని పటాన్ చెరువుకు తరలించేందుకు వచ్చిన ఉత్తర్వులను రద్దుచేసి హయత్ నగర్ లోనే కొనసాగించాలని కోరుతూ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని సీఓఈ కాలేజీలో చదువుకుంటున్న కొందరు ఇంటర్మీడియట్ విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఈ రోజు ఐటీడీఏ కార్యాలయానికి వచ్చి ఐటీడీఏ పిఓ యువరాజ్ మర్మటుకు వినతిపత్రం ఇచ్చినట్లు తెలిపారు.
పిఓ మాట్లాడుతూ… కాలేజీ తరలించాలని ఉద్దేశం తనకు లేదని ప్రిన్సిపాల్ సెక్రటరీ నుండి ఆదేశాలు ఉన్నాయని తెలిపినట్టు ఈ విషయంలో మాట్లాడుతానని పిఓ అన్నట్లు విద్యార్థులు వారి తల్లిదండ్రులు విలేకరులతో తెలిపారు. వివో సానుకూలంగా స్పందించలేదని విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఐటిడిఏ కార్యాలయం ముందు నిరసన తెలుపుతూ అనంతరం విలేకరులతో మాట్లాడుతూ… 2025 లో పదవ తరగతి విద్యార్థులైన వెనుకబడిన కుల విద్యార్థుల కోసం అప్పటి పిఓ కుష్బూ గుప్త సిఓఈ కాలేజీలో చదువుకోడానికి కౌన్సిలింగ్ నిర్వహించి ఇప్పుడు మళ్లీ ఆ కాలేజీ మార్చి పటాన్చెరువు కాలేజీకి తరలిస్తానని అధికారుల యోజనతో తమ చదువులకు ఆటంకం అవుతాయని రెండు నెలల్లో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ఉన్నాయని పరీక్షలు రాయడానికి ఇబ్బందులతో పాటు పరీక్షలు రాయలేని పరిస్థితులు ఉన్నాయని విద్యార్థులు విలేకరులతో తెలిపారు.
అధికారుల నిర్ణయాన్ని మార్చి సిఓఈ కాలేజీ హయత్ నగర్ లోని కొనసాగిస్తే విద్యార్థులకు అనుకూలంగా ఉంటుందని 186 విద్యార్థులు ఆ కాలేజీలో చదువుకుంటున్నారని వారి చదువులకు ఆటంకం కలుగకుండా అన్యాయం జరగకుండా ప్రభుత్వం ఉన్నతాధికారులు తగు చర్యలు తీసుకోవాలని విద్యార్థులు వారి తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. సిఓఈ కాలేజీని పట్టాన్ చెరువు కుమారిస్తే చదువుకోవడం కష్టంగా ఉంటుందని వారు పేర్కొన్నారు.
ఈ విషయంలో ఉన్నతాధికారులు తగు చర్యలు తీసుకొని హయత్ నగర్ సిఓఈ కాలేజీ ని ఆ ప్రాంతంలోనే కొనసాగించేలా చూడాలని, పటాన్ చెరువుకు తరలిస్తే తమ చదువులు కోవడం కష్టంగా మారుతుందని అక్కడికి వెళ్లి చదవలేమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గిరిజన సంక్షేమ ప్రతిభ కళాశాల ( సిఓఈ కాలేజ్ )విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
