తుపాను షెల్టర్ కు తరలింపు..

తుపాను షెల్టర్ కు తరలింపు..

పిచ్చాటూరు తాహసీల్దార్ తక్షణ స్పందన


(పిచ్చాటూరు, ఆంధ్రప్రభ) : తుపాన్‌ ప్రభావంతో తిరుపతి జిల్లా (Tirupati District) పిచ్చాటూరు మండలంలోని బంగాళా పంచాయతీ పరిధిలోని మలగుంట గ్రామంలో 17 ఇళ్లు శిథిలావస్థకు చేరుకున్నాయి. వర్షాల తీవ్రతకు ఇళ్ల పైకప్పుల నుంచి వర్షం కారి ఇళ్లల్లోని జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే తహసీల్దార్‌ టి.వి. సుబ్రహ్మణ్యం, ఎంపీడీవో మహ్మద్‌ రఫీ గ్రామానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.

బాధిత కుటుంబాలను మలగుంట ఎంపీపీ పాఠశాల (MPP School) లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి తరలించారు. వారికి తాత్కాలిక నివాసం, ఆహారం, తాగునీరు, వైద్య సదుపాయాలు కల్పించారు.గ్రామంలో చెరువులు, కాల్వల వద్ద నీటి మట్టాలను అధికారులు పరిశీలించారు. ఎలాంటి ప్రమాదాలు తలెత్తకుండా స్థానిక సిబ్బందికి తగిన సూచనలు ఇచ్చారు. పంచాయతీ కార్యదర్శి, గ్రామ సచివాలయ సిబ్బంది, వలంటీర్లు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. తహసీల్దార్ (Tahsildar) మాట్లాడుతూ ప్రజల ప్రాణ రక్షణే మా ప్రాధాన్యం. అవసరమైతే మరిన్ని కుటుంబాలను సురక్షిత ప్రదేశాలకు తరలించడానికి సిద్ధంగా ఉన్నాం అన్నారు. అధికారులు వర్షాల పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

Leave a Reply