ఎన్నికల షెడ్యూల్ విడుదల


హైదరాబాద్, ఆంధ్ర‌ప్ర‌భ : తెలంగాణాలో స్థానిక సంస్థ‌ల‌ ఎన్నికల(Telangana Local Body Elections)కు షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌క‌టించింది. ఈ రోజు ఉద‌యం ప‌దిన్న‌ర గంట‌ల‌కు రాష్ట్ర ఎన్నికల క‌మిష‌న‌ర్‌ (ఎస్‌ఈసీ) రాణికుముది వివ‌రించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్‌ను వివ‌రించారు. మొత్తం ఐదు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు. తొలి రెండు దశల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ.. మిగతా మూడు దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని వివరించారు.

ఎంపీటీసీ, జడ్పీటీసీలకు అక్టోబర్ 23న తొలివిడత, 27న రెండో విడత ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తామని రాణికుముది తెలిపారు. గ్రామ పంచాయతీలకు తొలి విడత అక్టోబర్ 31న, రెండో విడత నవంబర్ 4న, మూడో విడత నవంబర్ 8న నిర్వహిస్తామన్నారు. పోలింగ్ పూర్తయిన తర్వాత అదేరోజు గ్రామ పంచాయతీల ఓట్ల లెక్కింపు చేపడతామన్నారు. నవంబర్ 11న ఎంపీటీసీ, జడ్పిటీసీ ఓట్ల లెక్కింపు జరుగుతుందని తెలిపారు. (Telanganu Local Body Pections Schedule) రాష్ట్రంలో 31 జిల్లాల్లోని 565 మండలాల్లో ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. 5,719 ఎంపీటీస్, 565 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయని, 12,733 గ్రామపంచాయతీలు, 112,288 వార్డుల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు వివరించారు.

రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక ఎన్నిక‌ల సంద‌డి ఉన్నా… 27 పంచాయ‌తీల్లో మాత్రం ఆ సంద‌డి కాన‌రాదు. రాష్ట్రంలో 27 పంచాయ‌తీలు ఎన్నిక‌ల‌కు దూరంగా ఉంటాయి. 31 జిల్లాల్లో 565 మండలాల్లో 5,749 ఎంపీటీసీ, 656 జడ్పీటీసీ స్థానాలకు, 12,733 గ్రామపంచాయతీలు, 1,12,288 వార్డుల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల క‌మిష‌న‌ర్‌ (ఎస్‌ఈసీ) రాణికుముదిని వెల్లడించారు. అయితే రాష్ట్రమంతటా ఎన్నికల కోలాహలం మొదలైనా కొన్ని స్థానాల్లో ఎన్నికలు నిర్వహించబోవడం లేదని ఎస్ఈసీ తెలిపారు. కోర్టు కేసుల కారణంగా ములుగు జిల్లాలోని 25 గ్రామ పంచాయతీలు, కరీంనగర్ జిల్లాలోని 2 పంచాయతీలకు ఎన్నికలు లేవని స్పష్టం చేశారు.

నామినేషన్ల స్వీకరణ: అక్టోబర్ 9
స్వీకరణకు చివరి తేదీ: అక్టోబర్ 11
పరిశీలన: అక్టోబర్ 12
నామినేషన్ల ఉపసంహరణ- అక్టోబర్ 15
ఎన్నికల తేదీ- అక్టోబర్ 23
ఓట్ల లెక్కింపు- నవంబర్ 11

నామినేషన్ల స్వీకరణ: అక్టోబర్ 13
స్వీకరణకు చివరి తేదీ: అక్టోబర్ 15
పరిశీలన అక్టోబర్ 16
నామినేషన్ల ఉపసంహరణ- అక్టోబర్ 19
ఎన్నికల తేదీ- అక్టోబర్ 27
ఓట్ల లెక్కింపు- నవంబర్ 11

నామినేషన్ల స్వీకరణ: అక్టోబర్ 17
స్వీకరణకు చివరి తేదీ: అక్టోబర్ 19
నామినేష‌న్ల పరిశీలన: అక్టోబర్ 20
నామినేషన్ల ఉపసంహరణ- అక్టోబర్ 23
ఎన్నికల తేదీ, ఫలితాలు- అక్టోబర్ 31

నామినేషన్ల స్వీకరణ- అక్టోబర్ 21
స్వీకరణకు చివరి తేదీ: అక్టోబర్ 23
నామినేష‌న్ల పరిశీలన: అక్టోబర్ 24
నామినేషన్ల ఉపసంహరణ- అక్టోబర్ 27
నామినేషన్ల ఉపసంహరణ- అక్టోబర్ 27
ఎన్నికల తేదీ, ఫలితాలు- నవంబర్ 4

నామినేషన్ల స్వీకరణ- అక్టోబర్ 25
నామినేష‌న్ల స్వీక‌ర‌ణ‌కు చివరి తేదీ: అక్టోబర్ 27
నామినేష‌న్ల ప‌రిశీల‌న : అక్టోబర్ 28
నామినేషన్ల ఉపసంహరణ- అక్టోబర్ 31
ఎన్నికల తేదీ, ఫలితాలు- నవంబర్ 8

Leave a Reply