Red Cross| మీ ఇంటికి.. మీ వైద్యుడు

Red Cross| మీ ఇంటికి.. మీ వైద్యుడు
- శిశు మరణాల రేటు తగ్గించడానికి కార్యక్రమం
- రాష్ట్రంలో నంద్యాల జిల్లా ఎన్నిక…
Red Cross| నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : రాష్ట్రస్థాయిలో రెడ్ క్రాస్ మేనేజింగ్ కమిటీ సమావేశం సోమవారం విజయవాడలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రెడ్ క్రాస్ యాక్షన్ ప్లాన్ 2026 గురించి చర్చ జరిగింది. ఈ కార్యక్రమంలో మీ ఇంటికి మీ వైద్యుడు అనే ప్రాజెక్టు అమలుపై చర్చ కార్యక్రమం జరిగింది. రాష్ట్రంలో ఏడు జిల్లాలను ఎంపిక చేశారు. ఇందులో నంద్యాల జిల్లా ఉండటం గర్వకారణమని రెడ్ క్రాస్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ గోవిందరెడ్డి నంద్యాల జిల్లా అధ్యక్షుడు పర్ల దస్తగిరిలు తెలిపారు. రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమం జిల్లాలో అమలు చేసేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు. ఇందులో రక్త కేంద్రం, తలసేమియా కేంద్రం, కార్నియా సేకరణ కేంద్రం, జేఆర్సీ, వైఆర్సీ విపత్తు నిర్వహణతో పాటు సబ్ బ్రాంచుల ఏర్పాటు చేయనున్నారు. ఆర్ఈసీ ఫౌండేషన్ సహాయంతో రాష్ట్రంలోని 7 జిల్లాల్లో మీ ఇంటికి.. మీ వైద్యుడు ప్రాజెక్టు అమలు పై చర్చకు శ్రీకారం చుట్టారు. అమలుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.
ప్రాజెక్టు ప్రాథమిక లక్ష్యాలు
జిల్లాలో ఏడు మొబైల్ హెల్త్ క్లినిక్ల మద్దతుతో దుర్భలమైన, తక్కువ సేవలందించే ప్రాంతాల ఇంటి వద్దకే ప్రాథమిక వైద్య ఆరోగ్య సేవలను పేద మధ్యతరగతి ప్రజలకు అందించడం వంటి కార్యక్రమాలను చేపట్టనున్నారు. ప్రస్తుత ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థతో మొబైల్ హెల్త్ క్లినిక్లను నిర్వహించడం ద్వారా ప్రజారోగ్య వ్యవస్థను బలోపేతం చేయడంవంటి కార్యక్రమాలు చేపట్టనున్నారు. జిల్లాలో ఏ ప్రాంతంలోనూ శిశు మరణాల రేటును తగ్గించడానికి,ప్రసూతి మరణాల రేటు తగ్గించడానికి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అన్న రు.అధిక మరణాల రేటును తగ్గించడం, ప్రాజెక్టు ప్రాంతంలో అంటువ్యాధుల సంభవాన్ని తగ్గించడం మరియు 100 శాతం రోగనిరోధకత సాధించడం రాష్ట్ర ఆరోగ్య రహితంగా ఉండేందుకు ఈ ప్రణాళికలు సిద్ధం చేశారు.నంద్యాల జిల్లా రెడ్ క్రాస్ కు ఈ ప్రాజెక్టుకు ఎంపిక కావడానికి జిల్లా కలెక్టర్ జిల్లా రెడ్ క్రాస్ అధ్యక్షురాలు రాజకుమారి గణియా ఎంతో కృషి చేశారని తెలిపారు.
