సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై కలెక్టర్ ఆకస్మిక తనిఖీ…

సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై కలెక్టర్ ఆకస్మిక తనిఖీ…

శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ : శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్ మంగళవారం కదిరి పట్టణంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయంలో నిర్వహణ, రికార్డులు, రిజిస్ట్రేషన్ ప్రక్రియలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు.

కార్యాలయానికి వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సేవలు అందించాలని, పారదర్శకతను కచ్చితంగా పాటించాలని సిబ్బందికి సూచించారు. పెండింగ్‌లో ఉన్న దస్త్రాలను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం కార్యాలయ పరిసరాలను పరిశీలించిన కలెక్టర్ నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ తనిఖీలో ఆర్డీఓ వివిఎస్ శర్మ, మున్సిపల్ కమిషనర్ కిరణ్ కుమార్, సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply