Record | ప్రధాని మోడీకి అరుదైన ఘనత

Record | ప్రధాని మోడీకి అరుదైన ఘనత

Record | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: ప్రధాని నరేంద్ర మోదీ అరుదైన ఘనత సాధించారు. దేశంలో సుదీర్ఘకాలం పాటు ప్రభుత్వాధినేతగా వ్యవహరించిన సిక్కిం మాజీ సీఎం పవన్ కుమార్ చామ్లింగ్ రికార్డును ప్రధాని మోదీ అధిగమించి కొత్త రికార్డును సొంతం చేసుకున్నారు. సీఎంగా 8,930 రోజుల పాటు సేవలందించిన రికార్డు పవన్ కుమార్ చామ్లింగ్ పేరిట ఉండేది. మార్చి 22 నాటికి గుజరాత్ సీఎంగా, దేశ ప్రధానిగా ప్రభుత్వాధినేత హోదాల్లో నరేంద్ర మోదీ 8,931 పనిదినాలను పూర్తి చేశారు. దీంతో చామ్లింగ్ రికార్డు బద్దలైంది.

మంత్రి లోకేష్ దేశ ప్రధాని సాధించిన ఈ చారిత్రాత్మక మైలురాయిపై అభినందనలు తెలిపారు. దేశ చరిత్రలోనే అత్యధిక కాలం ప్రభుత్వాధినేతగా సేవలందించడం గొప్ప విషయమని, ఇది ఆయన కృషి, పట్టుదల, ప్రజల పట్ల ఉన్న అంకితభావానికి నిదర్శనమని పేర్కొన్నారు. దేశ అభివృద్ధి దిశగా ఆయన తీసుకున్న నిర్ణయాలు భారతదేశాన్ని మరింత బలంగా నిలబెట్టాయని అన్నారు. ఈ అరుదైన ఘట్టం సందర్భంగా ప్రధాని మోదీకి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని నాయకత్వంలో దేశం మరింత పురోగమించాలని ఆకాంక్షించారు.

Leave a Reply