EC | తెలంగాణలోనూ జనసేన పార్టీకి గుర్తింపు !
జనసేన పార్టీకి ఎన్నికల సంఘం తీపి కబురు అందించింది. తెలంగాణలో కూడా జనసేన పార్టీకి గుర్తింపు వచ్చింది. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు గాజు గుర్తును కేటాయించారు. ఈ మేరకు జనసేన పార్టీని తెలంగాణలో కూడా గుర్తిస్తూ ఎన్నికల సంఘం కార్యదర్శి అశోక్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందిన జనసేన పార్టీని గుర్తిస్తూ గాజు గ్లాసు గుర్తు కేటాయించిన సంగతి తెలిసిందే.