భూ వివాదాలే కారణం
వేములవాడ, ఆంధ్రప్రభ : భూ వివాదాలు రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్య (RealEstateMurder)కు దారి తీసాయి. శనివారం రాజన్న సిరిసిల్ల (Rajanna Sircilla) జిల్లా నాంపల్లి శివారులోని నంది కమాన్ వద్ద సిరిసిల్ల కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి సిరిగిరి రమేష్ (Sirigiri Ramesh)ను కొందరు దుండగులు దారుణంగా హత్య చేశారు.
రియల్ ఎస్టేట్ వివాదాల కారణంగానే హత్య జరిగినట్లు అనుమానిస్తున్నారు. హత్య చేసిన నిందితుల్లో ఒకరైన వెంకటేష్ (Venkatesh) అనే వ్యక్తి పోలీసు స్టేషన్ లో లొంగిపోయినట్లు సమాచారం. హత్యకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

